Telangana

News June 16, 2024

బిజినేపల్లి: నీటి గుంతలో పడి రైతు మృతి

image

నీటి గుంతలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలం మహాదేవుని పేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి (48) తన పొలంలో నీటి గుంతలో అమర్చిన మోటర్‌కు పట్టిన నాచును తొలగించి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి పొలానికి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 16, 2024

హైదరాబాద్: SBI ఏటీఎంలో పాము

image

SBI ఏటీఎంలోకి పాము చొరబడిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. స్థానికుల వివరాలు.. హయత్ నగర్ బొమ్మల గుడి ఎస్బీఐ ఏటీఎంలోకి పాము చొరబడింది. దీంతో ఏటీఎం సెంటర్‌లోకి డబ్బులను డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు పామును చూసి భయాందోళన చెందారు. వెంటనే సిబ్బందికి తెలిపి అనంతరం స్నేక్ స్నాచర్‌కు సమాచారం అందించారు.

లింగాల ఘనపూర్: యువతిపై కిడ్నాప్‌కు యత్నం

image

ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు యత్నించి.. విఫలమై కారులో పారిపోయిన ఘటన లింగాల ఘనపూర్ మండలం పటేలుగూడెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్థులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి పత్తి గింజలు నాటేందుకు పొలానికి వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో వచ్చి యువతిని లాక్కెళ్లాడు. యువతి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 16, 2024

KMM: సెల్ఫీ దిగిందని అసభ్యకరంగా మెసేజ్‌లు.. అరెస్ట్

image

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన గండమాల రాహుల్, HYDకు చెందిన ప్రనీశ్ స్నేహితులు. తన సోదరుడికి స్నేహితుడు కావడంతో ప్రనీశ్ సోదరి కొంతకాలం క్రితం రాహుల్‌తో సెల్ఫీ దిగింది. దీన్ని అదనుగా తీసుకుని రాహుల్ ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News June 16, 2024

కరీంనగర్: చిన్నారిపై హత్యచారం.. నిందితుడికి రిమాండ్

image

ఆరేళ్ళ చిన్నారిని ఓ యువకుడు హత్యచారం చేసిన విషయం తెలిసిందే. బిహర్‌కు చెందిన నిందితుడు వినోద్ మాజేను పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరుపర్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంతం కుమార్ నిందితుడికి రిమాండ్ విధించారు. దీంతో అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

News June 16, 2024

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో పెరిగిన ప్రసూతి మరణాలు

image

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసూతి మరణాల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య తగ్గినా.. ఈ రెండు జిల్లాల్లో ప్రసూతి మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత రెండేళ్లలో మృతి చెందిన వారిలో 40 శాతం మంది 21 నుంచి 25 ఏళ్ల వయసు లోపువారే ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ నివేదిక ద్వారా తెలుస్తోంది. 71 శాతం మంది సిజేరియన్ ఆపరేషన్ల సమయంలో, సహజ ప్రసవాల్లో 29 శాతం మరణించినట్లు నివేదికలో వెల్లడైంది.

News June 16, 2024

HYD: చెరువుల్లా మారుతున్న రోడ్లకు సరికొత్త పరిష్కారం!

image

రాజధానిలో చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారుతున్న రోడ్ల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. దీనికి సంబంధించిన పనులను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు మొదలుపెట్టి పూర్తి చేయబోతున్నారు. వర్షాలతో చెరువులుగా మారే ప్రాంతాల్లో దానికి సమాంతరంగా పెద్దసంపు తవ్వి నీటిని అందులోకి మళ్లించే ఏర్పాటు చేయనున్నారు.

News June 16, 2024

ఎల్లారెడ్డి: పొలం తగదాలో వ్యక్తి హత్య

image

ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో శనివారం కుర్మ దుర్గయ్య హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం లక్ష్మితో 15 ఏళ్ల క్రితం దుర్గయ్య పెళ్లి జరిగింది. విడాకులు తీసుకోవడానికి కోసం భార్యకు కొంత భూమిని సైతం ఆమె పేరునా మార్చాడు. కొంత భూమి తాను ఉంచుకున్నాడు. ఆ భూమి విషయమై భార్య లక్ష్మి, కుమారుడు గౌతమ్, మామ సాయిలు కలిసి కుర్మ దుర్గయ్య పై దాడి చేయగా తీవ్ర గాయాలతో దుర్గయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.