Telangana

News June 16, 2024

HYD: 22న HCA టాలెంట్ హంట్

image

ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.

News June 16, 2024

నిరాశతో వెనుదిరుగుతున్న బొగత సందర్శకులు!

image

ములుగు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాజేడు మండలం బొగత జలపాతం నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పర్యాటకులను ఆకట్టుకునే జలపాతం వేసవిలో బోసి పోతుందంటున్నారు. జలపాతానికి ఎగువన ఉన్న చెక్ డ్యాం మరమ్మతులకు గురై నీరు నిలవడం లేదు. దీంతో సందర్శనకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు.

News June 16, 2024

బక్రీద్ సందడి.. HYDకు గొర్రెలు, పొట్టేళ్లు..!

image

బక్రీద్ పండుగ సందర్భంగా HYDలో సందడి నెలకొంది. పాతబస్తీతో పాటు రాజేంద్రనగర్, పీడీపీ చౌరస్తా, నౌ నంబరు, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, జూపార్క్ రోడ్, గోల్డెన్ హైట్స్, మౌలాలి, చెంగిచర్ల మేకల మండి, దేవరయాంజల్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో గొర్రెలు, పొట్టేళ్లు అమ్మకానికి తీసుకొచ్చారు. బక్రీద్ నేపథ్యంలో ముస్లిం సోదరులు గొర్రెలను కుర్బానీ ఇస్తారు. మంచి గిరాకీ ఉంటుంది.

ఆదిలాబాద్: TUTF భవనంలో ఉచిత వెబ్ అప్షన్ ప్రక్రియ

image

ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్ అప్షన్‌లు పెట్టుకునే అవకాశం శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు వరకు ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని TUTF సంఘ భవనంలో ఉచితంగా వెబ్ అప్షన్‌లు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఉపాద్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలందర్ తెలిపారు.

News June 16, 2024

HYD: రిజర్వేషన్ల అమలులో అవకతవకలు: ఆర్.కృష్ణయ్య

image

ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో పలు అవకతవకలు జరిగాయని, జీఓ నంబర్ 550ని సక్రమంగా అమలు చేయకపోవడంతో 262 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండా పోయాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుజ్జ కృష్ణ, టీ.రాజ్ కుమార్‌తో శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు.

News June 16, 2024

వరంగల్: నేడు 144 సెక్షన్ అమలు

image

సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి సీపీ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News June 16, 2024

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ MLA పైడి రాకేశ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన్ను కోరారు. ఎమ్మెల్యేతో పాటు BJP రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి ఉన్నారు.

News June 16, 2024

HYD: రిజర్వేషన్ల అమలులో అవకతవకలు: ఆర్.కృష్ణయ్య

image

ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో పలు అవకతవకలు జరిగాయని, జీఓ నంబర్ 550ని సక్రమంగా అమలు చేయకపోవడంతో 262 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండా పోయాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుజ్జ కృష్ణ, టీ.రాజ్ కుమార్‌తో శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు.

News June 16, 2024

సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న మెసేజ్ లకు స్పందించవద్దు: సీపీ

image

ఎస్బీఐ యూనో అప్లికేషన్స్ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్ లను స్పందించి మోస పోవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్ డేట్ కోసం వివరాలు అడగవని, మోసపూరిత మెసేజ్‌లలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.