Telangana

News June 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు బదిలీ. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ దివాకర బదిలీ. @ గొల్లపల్లి మండలంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం. @ మెట్‌పల్లి మండలంలో గుండెపోటుతో పూజారి మృతి. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ. @ మల్యాల మండలంలో రెండిళ్లలో చోరీ. @ కథలాపూర్ మండలంలో 8 మంది పేకాట రాయుళ్ల పట్టివేత.

News June 15, 2024

వరంగల్: రేపు 144 సెక్షన్ అమలు

image

సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి సీపీ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.

News June 15, 2024

నీతి, నిబద్ధతతో అధికారులు సేవలు అందించాలి: జూపల్లి

image

నీతి, నిజాయితీ నిబద్ధతతో అధికారులు ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పెద్దకొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గదులు పుస్తకాలు, దుస్తులు, భోజనం, తగినంతమంది టీచర్లను నియమిస్తామన్నారు. ఎంపీ మల్లురవి, ఎంపీపీ పాల్గొన్నారు.

News June 15, 2024

HYD: అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

image

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎస్ఎల్‌వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువర్యులు చింత నాగార్జున శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కర్ణాటక గాత్ర కచేరీలో చూడమ్మా సతులారా, భో శంభో, వేంకటేశుడు, తరతరాల తిరుమల, స్వాగతం కృష్ణ, గోదావరి అంశాలను కళాకారులు ఆలపించారు. నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.

News June 15, 2024

HYD: అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

image

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎస్ఎల్‌వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువర్యులు చింత నాగార్జున శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కర్ణాటక గాత్ర కచేరీలో చూడమ్మా సతులారా, భో శంభో, వేంకటేశుడు, తరతరాల తిరుమల, స్వాగతం కృష్ణ, గోదావరి అంశాలను కళాకారులు ఆలపించారు. నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.

News June 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC రీజినల్ మేనేజర్ బదిలీ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చెరుకుల్లి వెంకన్న బదిలీ అయ్యారు. ఆయనను TGSRTC చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (ప్రధాన కార్యాలయం) గా నియమించారు. ఆ స్థానంలో రంగారెడ్డి రీజియన్ నుండి డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) గా ఉన్న సరీరాం పదోన్నతి పొంది ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ గా రానున్నారు.

News June 15, 2024

కనగల్‌ హత్యకేసు చేధించిన పోలీసులు

image

<<13277667>>కనగల్‌లో<<>> గత నెల 19న గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా ఆ వ్యక్తి‌ని హత్యచేసిన 7గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుడుయాదగిరిగుట్టకు చెందిన సముద్రాల కృష్ణగా గుర్తించారు. రైస్ పుల్లింగ్ యంత్రం ఇప్పిస్తానని ఓ ముఠా‌తో కృష్ణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 6 నెలలు గడిచినా పుల్లింగ్ యంత్రం ఇప్పించలేదని ముఠా కృష్ణని చంపింది.

News June 15, 2024

పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల వివరాలు

image

పట్టుబడిన మావోయిస్టుల వివరాలు:
1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్.
2) సోడి కోసి @ మోతే D/o అడమాలు . పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు,
3) సోడి విజయ్ @ ఇడుమ S/o జోగ, 1 బెటాలియన్ సభ్యుడు,
4) కుడం దస్రు S/o గంగ, మిలిషియా సభ్యుడు
5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు
6) మడకం భీమ S/o కోస, మిలిషియా సభ్యుడు.

News June 15, 2024

ADB: ‘రైతుబందు కోసం ఎదురుచూపులు’

image

వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబందు పథకం కింద అందించే పెట్టుబడి సహాయం ఆలస్యం కావడంతో అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రారంభమై వారం రోజులు గడిచిన రైతుబందు జాడ లేదని రైతులు ఆరోపించారు. జిల్లాలో 1,63,359 మంది రైతులు ఉండగా జిల్లా వ్యాప్తంగా రూ.2,872,851,984 నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.

News June 15, 2024

ఆర్మూర్: యువకుడి గొంతు కోసిన దుండగులు

image

బీర్ బాటిల్‌తో యువకుడి గొంతు కోసిన ఘటన ఆర్మూర్‌లో జరిగింది. బిహార్‌కు చెందిన సోనుకుమార్ పై దుండగులు ఆర్మూర్‌లోని సిద్దుల గుట్ట ప్రాంతంలో శనివారం బీర్ బాటిళ్లతో దాడి చేసి గొంతు కోశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు అంబులెన్సు‌లో ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.