Telangana

News June 15, 2024

BREAKING: HYD: నిజాం కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

image

ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్‌కు చెందిన రవి HYDతార్నాకలోని ఓయూ హాస్టల్‌లో ఉంటూ నిజాం కాలేజీలో చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి అతడు దూకగా శబ్దం విన్న తోటి విద్యార్థులు వెంటనే వచ్చి రవిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

News June 15, 2024

గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త

image

బోనకల్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గుండె కుడివైపు ఉందంటూ వివాహమాడిన భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. వివరాలకెళ్తే.. KMMకు చెందిన భవానిని బోనకల్ (M)కి చెందిన భాస్కరచారి వివాహమాడాడు. కాగా భార్యకు గుండె కుడివైపున ఉందంటూ ఇటీవల తెలియడంతో భాస్కరచారి తల్లిదండ్రులతో కలిసి గత కొన్ని నెలలుగా వేధింపులు గురి చేస్తున్నాడు. వారి వేధింపులను తట్టుకోలేక భవాని పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది.

News June 15, 2024

HYD: ఈనెల 17న ప్రజావాణి లేదు: GHMC కమిషనర్

image

HYD ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 17న ఉండదని GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఈరోజు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రజావాణి ఉండదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

మహబూబాబాద్: 22న HCA టాలెంట్ హంట్

image

ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జి అజయ్ సారథి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు నేటి నుంచి తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News June 15, 2024

కామారెడ్డి జిల్లాలో 961 మంది ఆత్మహత్య

image

మానసిక ఒత్తిళ్లు, కుటుంబ, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా వివిధ కారణాలతో తనువు చాలించే వారి సంఖ్య కామారెడ్డి జిల్లాలో పెరుగుతోంది. జిల్లాలో రోజూ ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022లో 416 మంది, 2023లో 386 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 159 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

News June 15, 2024

HYD: రేపటి నుంచి రవీంద్రభారతిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్

image

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల పెయింటింగ్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు HYD రవీంద్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారందరూ ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్ చూడాలని కోరారు.

News June 15, 2024

HYD: రేపటి నుంచి రవీంద్రభారతిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్

image

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల పెయింటింగ్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు HYD రవీంద్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారందరూ ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్ చూడాలని కోరారు.

News June 15, 2024

మహబూబాబాద్: 22న HCA టాలెంట్ హంట్

image

ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జి అజయ్ సారథి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు నేటి నుంచి తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News June 15, 2024

ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య: సీఐ కృష్ణ

image

తాడ్కోల్ డబుల్ బెడ్రూం కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉప్పరి సాయవ్వ(70)ను ఈ నెల 12న గొంతు కోసి హత్య చేసిన ఘటనలో నిందితుడు తొడిమెల సాయిబాబాను శనివారం అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ సీఐ కృష్ణ తెలిపారు. నిందితుడు బెట్టింగ్ లతో అప్పులపాలై సాయవ్వ వద్ద రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడని, ఒంటరిగా ఉన్న సాయవ్వను ఎలాగైనా హత్య చేసి ఆమె వద్ద ఉన్న ఆభరణాలు దోచుకునేందుకు పథకం ప్రకారం హత్య చేశాడని సీఐ వివరించారు.