Telangana

News June 15, 2024

NZB: నాలుగు నెలల్లో రూ. 8.52 కోట్ల ఆదాయం

image

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకుసాగుతోంది. నిజామాబాద్ రీజీయన్‌లో ఏసీ బస్సులు ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని సమకూర్చాయి. వేసవిలో వేడిమి తట్టుకునేందుకు ప్రయాణీకులు వీటిని ఆశ్రయించారు. రెండు డిపోల్లోని ఏసీ బస్సులు పిబ్రవరి నుంచి మే వరకు రూ. 8.52 కోట్ల ఆదాయం సమాకూర్చాయి. నిజామాబాద్‌ – JBSకు నిత్యం 19 ఏసీ బస్సులు నడిపిస్తున్నారు. నిత్యం సగటున రూ.6 లక్షల ఆదాయం సమకూరుతోంది.

News June 15, 2024

అంతర్జాతీయ సదస్సుకు తారా డిగ్రీ అధ్యాపకురాలు

image

సంగారెడ్డి ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు పట్లోళ్ల అశ్విని రేపటి నుంచి 19 వరకు చైనాలో జరిగే 10వ ఏషియన్ పసిఫిక్ ఎక్సర్ సైజ్ స్పోర్ట్స్ సైన్స్ – 2024 సదస్సుకు ఎంపికయ్యారు. చైనాలో జరిగే సదస్సుకు 46 దేశాల ప్రతినిధులు పాల్గొంటుండగా.. ఈ సదస్సుకు భారత్ నుంచి ఫిజికల్ విభాగంలో అశ్విని ఒక్కరే ఎంపికయ్యారు.

News June 15, 2024

నిజామాబాద్ రెడ్ క్రాస్ శాఖకు అవార్డుల పంట

image

నిజామాబాద్ రెడ్ క్రాస్ శాఖకు అవార్డుల పంట పండింది. ఈ సందర్భంగా రావాణాశాఖ మంత్ర పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ రక్తదాతగా పురుషోత్తం రెడ్డి, ఉత్తమ ప్రోత్సాహకుడిగా రవీందర్, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించిన మోహన్ రెడ్డి, కళాశాల విభాగంలో విజయ్ బాబు అవార్డులు అందుకున్నారు. కామారెడ్డికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ బాలు ఉత్తమ రక్తదాత పురస్కారం అందుకున్నారు.

News June 15, 2024

HYD: ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’

image

వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం.. బైకును ఢీ కొట్టడంతో జగ్గప్పకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే గాయాలతో పడి ఉన్న తండ్రికి కొడుకు బ్రూస్లీ ధైర్యం చెప్పాడు. ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’ అంటూనే కుటుంబీకులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. స్థానికులతో కలిసి తండ్రిని ఆస్పత్రికి తరలించే సమయంలో జగ్గప్ప తల నుంచి రక్తం రావడంతో బట్టతో అదిమి పట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

News June 15, 2024

HYD: ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’

image

వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం.. బైకును ఢీకొట్టడంతో జగ్గప్పకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే గాయాలతో పడి ఉన్న తండ్రికి కొడుకు బ్రూస్లీ ధైర్యం చెప్పాడు. ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’ అంటూనే కుటుంబీకులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. స్థానికులతో కలిసి తండ్రిని ఆస్పత్రికి తరలించే సమయంలో జగ్గప్ప తల నుంచి రక్తం రావడంతో బట్టతో అదిమి పట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

News June 15, 2024

ఓయూ: వివిధ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ.రాములు తెలిపారు. బీఫార్మసీ 8వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 18లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 21లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలన్నారు.

News June 15, 2024

ఓయూ: బీఈడీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News June 15, 2024

ఓయూ: బీఈడీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News June 15, 2024

ఎంఎన్జేలో క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన రేడియోషన్‌ థెరఫీ మెషిన్ సేవలు

image

క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన రేడియోషన్‌ థెరఫీలో అత్యాధునిక సేవలు ఎంఎన్‌జేలో అందుబాటులోకి రానున్నాయి. దాదాపు రూ.30 కోట్లతో ఈ ఆధునిక రేడియేషన్‌ థెరఫీ యంత్రాన్ని ఆసుపత్రిలో సమకూర్చారు. అటమిక్‌ ఎనర్జీ విభాగం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఈ సేవలు అందించనున్నారు. ఇలాంటి ఆధునిక యంత్రాలు ప్రస్తుతం పెద్దపెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఉన్నాయి. రేడియో థెరఫీలో ఇదో విప్లవాత్మక మార్పు అని వైద్యులు తెలిపారు.

News June 15, 2024

హైదరాబాద్‌లో నేటి నుంచి డయల్ యువర్ ఎండి

image

జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు సమస్యలను తెలుసుకుంటామన్నారు. మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ ఇతర సమస్యలపై 23442881, 23442882, 23442883 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.