Telangana

News June 15, 2024

మగ పిల్లలు పుట్టలేదని వివాహిత సూసైడ్

image

మగపిల్లలు పుట్టలేదని, పుట్టిన ఒక కుమార్తె అనారోగ్యంతో మృతి చెందిందని మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన జడ్చర్ల మండలంలో  జరిగింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన అపర్ణకు ఆలూరుకు చెందిన మైబుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఈనెల 13న భర్త మేస్త్రీ పనికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

News June 15, 2024

వరంగల్ ఇన్‌ఛార్జ్ సీపీగా అభిషేక్ మహంతి

image

వరంగల్ ఇన్‌ఛార్జ్ సీపీగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాఖాపరమైన శిక్షణ నిమిత్తం డిల్లీకి వెళ్లడంతో మహంతికి ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఆయనకు రోజువారీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27న శిక్షణ పూర్తయ్యాక సీపీ అంబర్ కిషోర్ ఝా వరంగల్‌కు రానున్నారు.

News June 15, 2024

HYD: మాత్రలు వికటించి వ్యక్తి మృతి

image

మద్యం మత్తులో అధిక మొత్తంలో జ్వరం మాత్రలు వేసుకున్న వ్యక్తి మాత్రలు వికటించి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్‌ మండలంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేశ్‌(32) జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న జ్వరం మాత్రలను అధిక మొత్తంలో వేసుకున్నాడు. దీంతో మాత్రలు వికటించి మల్లేశ్‌ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 15, 2024

HYD: మాత్రలు వికటించి వ్యక్తి మృతి

image

మద్యం మత్తులో అధిక మొత్తంలో జ్వరం మాత్రలు వేసుకున్న వ్యక్తి మాత్రలు వికటించి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్‌ మండలంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేశ్‌(32) జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న జ్వరం మాత్రలను అధిక మొత్తంలో వేసుకున్నాడు. దీంతో మాత్రలు వికటించి మల్లేశ్‌ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 15, 2024

KMM: ఈ-కేవైసీ తప్పనిసరి

image

బీఆర్ఎస్ హయాంలోనే రేషన్‌కార్డుదారుల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ మొదలైంది. 7నెలలుగా 100శాతం కూడా పూర్తికాలేదు. సెప్టెంబర్‌ 30వరకు గడువును పొడిగిస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో సుమారు 20శాతం, భద్రాద్రి జిల్లాలో 22శాతం మంది ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, చదువుల కోసం వెళ్లినవారు ఈ-కేవైసీ చేయించేందుకు రావట్లేదని సమాచారం.

News June 15, 2024

KNR: రూ.10,182.7 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10,182.7 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్‌ పమేలా సత్పతి శుక్రవారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అవసరాల కోసం రూ. 3673.92 కోట్లు, ఎంఎస్‌ఎంఈ కింద రూ.2997.06 కోట్లు, విద్యా రుణాలు రూ. 44.55 కోట్లు, గృహ రుణాలు రూ.192.00 కోట్లు, ఇతర రంగాలకు గానూ రూ. 3275.17 కోట్ల రుణాలను అందించాలని బ్యాంకర్లు ఆదేశించారు.

News June 15, 2024

NLG: రేషన్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు

image

ఆధార్, రేషన్‌ కార్డుల అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 ఆఖరు తేదీ కాగా Sept 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం ప్రకటన చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,07,251 కార్డులుండగా, 29,86,875 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో 21,89,466 మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా 7,97,409 మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది.

News June 15, 2024

వనదుర్గ ప్రాజెక్టు‌లో మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు శుక్రవారం నీట మునిగి మృతి చెందాడు. నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడని పాపన్నపేట SI నరేశ్ తెలిపారు. HYDకి చెందిన ఎస్లీ వినోద్(48) స్థానికంగా వంట మనిషిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు వనదుర్గా ప్రాజెక్టులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేశామన్నారు.

News June 15, 2024

ASF:బాలికపై హత్యాచారం.. నిందితుడిపై చర్యలకు డిమాండ్

image

దహెగాం మండలానికి చెందిన ఆరేళ్ల బాలికపై పెద్దపల్లి జిల్లాలో అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కౌటాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

News June 15, 2024

నిరుపేద తల్లిదండ్రులకు సాయం అందించాలి: కలెక్టర్‌

image

విద్యారుణ శిబిరాలు నిర్వహించి నిరుపేద తల్లిదండ్రులకు తక్షణమే సాయం అందించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల వారీగా రుణ లక్ష్యాలు, సాధించడంపై సమీక్షించారు. 2023-24లో జిల్లాలో విద్యారుణాలు రూ.1203.84 కోట్లు లక్ష్యంగా ఉండగా.. ఇప్పటివరకు రూ. 131.95 కోట్లు (10.96%) ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.