Telangana

News June 15, 2024

నిర్మల్: ధరణి సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్

image

ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలను తీసుకుంటున్నామని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ప్రధానకార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ (VC) నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై చర్చించారు.

News June 15, 2024

NZB: ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ధరణిలో వివిధ మాడ్యూల్స్ కింద దాఖలైన దరఖాస్తులను తక్షణమే పరిశీలిస్తూ, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.

News June 15, 2024

NLG: యువతీ, యువకులకు గుడ్ న్యూస్

image

పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

News June 15, 2024

ఖమ్మం: వివిధ పనులపై కలెక్టర్ గౌతమ్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైల్వే, జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై అధికారులతో, కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులకు సంబంధించి, వాస్తవ అవసరం మేరకు పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

News June 14, 2024

మెదక్: వీడిన జంట హత్యల మిస్టరీ

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మే23న వెలుగు చూసిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. 25రోజుల క్రితం బంగారం కోసం తల్లిదండ్రులను వారి కొడుకే హత్య చేసినట్లు గుర్తించారు. జల్సాలకు అలవాటు పడ్డ లక్ష్మణ్ డబ్బు కోసం తల్లిదండ్రులను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News June 14, 2024

HYD: యూసుఫ్‌గూడ యాక్సిడెంట్‌లో చనిపోయింది ఈమెనే..!

image

HYD మధురానగర్ PS పరిధి యూసుఫ్‌గూడలో ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి ఇంటర్ <<13439494>>విద్యార్థిని మెహరీన్‌<<>> చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తమతో ఉన్న ఫ్రెండ్ చనిపోయిన విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. విగత జీవిగా ఉన్న మెహరీన్‌ను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రయాణికులూ.. బస్సు దిగేటప్పుడు జర జాగ్రత్త!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ రుద్రంగి మండలంలో బస్సు, బైకు ఢీ.. యువకుడి మృతి. @ తంగళ్ళపల్లి మండలంలో బస్సు, డీసీఎం ఢీ.. పలువురికి గాయాలు. @ మెట్పల్లి మండలంలో 9 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ పెద్దపల్లి జిల్లాలో బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కీచకుడు. @ బీర్పూర్ మండలంలో అసంపూర్తిగా కాలిన మృతదేహం లభ్యం.

News June 14, 2024

HYD: నీట్ ఫలితాల అవకతవకాలపై విచారణ జరిపించాలి: SFI

image

నీట్ ఫలితాల అవకతవకాలపై విచారణ జరిపించాలని కోరుతూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య పార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు మాట్లడుతూ.. నీట్ ఫలితాల అవకతవకాలపై కేంద్రం స్పందించకుండా, గ్రేస్ మార్కులు పొందిన వారి స్కోర్ కార్డులు రద్దు చేసి, వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు పక్కదారి పట్టించడమే అని అన్నారు.