India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవాహాల దగ్గరగా వెళ్లి చూడటం, వాటి వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీయడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు హెచ్చరించారు. సెల్ఫీ మోజు కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రోడ్ల ఆక్రమణలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ప్రయత్నాలను హై కోర్టు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి కొనియాడారు. రాంనగర్ క్రాస్‌రోడ్స్ వద్ద రోడ్ల ఆక్రమణలపై దాఖలైన PIL విచారణ సందర్భంగా ప్రజా రోడ్లు, పార్కులను కాపాడటంలో హైడ్రా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అధికారులు, ప్రజల ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరద నష్టం ప్రాంతాలను సందర్శించడానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మెదక్‌కు వస్తున్నారు. జిల్లా సరిహద్దులో గల పోచారం డ్యామ్, సర్దన గ్రామ పునరావాస కేంద్రాలు, మెదక్ పట్టణంలో పర్యటించనున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం తెలిపారు.
ఐటీఐ కళాశాలలో చేరేందుకు రేపటితో ప్రవేశాల గడువు ముగుస్తుందని ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ATCలో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు వెల్లడించారు. ITIలో ఇంకా 11 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. డ్రెస్ మేకింగ్ ట్రేడ్‌లో 4, స్టెనోగ్రఫీలో 3, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడ్‌లో 4 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇవాళ ఉదయం సైకిల్‌పై పనికి వెళ్లే ఇద్దరికి ఓ బైకిస్ట్ ఇలా లిఫ్ట్ ఇచ్చాడు. అబిడ్స్‌లో ఓ చోట పనిచేయడానికి మలక్‌పేట్ పరిసర ప్రాంతాల నుంచి వారిద్దరు నిత్యం సైకిల్‌పై వెళ్తుంటారు. కాగా ఓ బైకర్ ఇలా లిఫ్ట్ ఇవ్వడంతో 20-25నిమిషాల సైకిల్ జర్నీ 10MINలో పూర్తైందని చెబుతున్నారు. ఇలాంటి సహసాలు చేస్తే ఇతర ప్రయాణికులకూ ప్రమాదమని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం 7నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2026 మార్చి వరకు CSగా కొనసాగనున్నారు. కాగా 2025 మేలో ఆయనను తెలంగాణ CSగా ప్రభుత్వం సిఫారసు చేయగా.. కేంద్రం ఆమోదించింది. ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుండగా.. మరి కొంతకాలం పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాయగా దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఉపాధ్యాయులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ఖుష్బూ గుప్తా తెలిపారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలకు సంబంధించి ఆయా కేటగిరీల్లో మండలానికి ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను ఎంపిక చేసి సెప్టంబర్ ర్ 2లోపు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని ఎంఈవోలకు సూచించారు.
గ్రామీణ విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను వెలికి తీసేందుకు నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నైపుణ్య విద్యలో శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించింది. రేపటి వరకు చాన్స్ ఉన్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ కోరుతున్నారు.
జిల్లాలో అత్యధికంగా మెదక్‌లోనే 11.3 (113.3 మిమీలు) సెంమీ వర్షం కురిసింది. డివిజన్ కేంద్రం నర్సాపూర్లో 103.3 మిమీలు, సర్ధనలో 96.8, శివునూరులో 95.3, చేగుంటలో 78.5, రామాయంపేటలో 61.5, పాతూరులో 56.8, పెద్ద శంకరంపేటలో 51.3 మిమీల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు కూడా మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 85.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్జిల్ 63.3, జడ్చర్ల 34.3 మహబూబ్ నగర్ అర్బన్ 21.5, భూత్పూర్ 19.5, చిన్నచింతకుంట 13.3, కౌకుంట్ల 10.5, కోయిలకొండ మండలం పారుపల్లి 10.0, బాలానగర్ 8.5, మూసాపేట 5.8, దేవరకద్ర, హన్వాడ 3.8, మిల్లీమీటర్ల వాన పడింది.
Sorry, no posts matched your criteria.