Telangana

News June 14, 2024

HYD: ట్రైనీ ఐఏఎస్‌లకు సజ్జనార్ అవగాహన

image

తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం HYDలోని బస్‌భవన్‌ను సందర్శించారు. టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలుపై వివరాలు తెలిపారు.

News June 14, 2024

HYD: ట్రైనీ ఐఏఎస్‌లకు సజ్జనార్ అవగాహన

image

తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం HYDలోని బస్‌భవన్‌ను సందర్శించారు. టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలుపై వివరాలు తెలిపారు.

News June 14, 2024

ఉమ్మడి జిల్లా “TODAY TOP NEWS”

image

√NRPT: ప్రత్యర్థుల దాడి ఘటనలో వ్యక్తి దారుణ హత్య.
√ ఊట్కూరు ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్.
√ పార్లమెంటులో పాలమూరు గళం వినిపిస్తా: డీకే అరుణ.
√ ఊట్కూరు ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేసిన ఎస్పీ.
√ పర్యాటక రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి: మంత్రి జూపల్లి.
√ తెలంగాణ హక్కులపై చంద్రబాబు కుట్ర: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
√ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా బీసీ మేధావుల సంఘం.

News June 14, 2024

పెండింగ్ ధరణి సమస్యలను పరిష్కరించాలి: నవీన్ మిట్టల్

image

పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

News June 14, 2024

HYD: సీఐకి 14 రోజుల రిమాండ్..!

image

HYD CCSలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ <<13435343>>సీహెచ్.సుధాకర్‌<<>> గురువారం రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకుని అందులో మొదట విడతగా రూ.5 లక్షలు తీసుకున్నాడు. మరో రూ.3లక్షలు తీసుకుని పారిపోతుండగా ఛేజ్ చేసి అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం సుధాకర్‌ని విచారణ చేసి, నాంపల్లి ACB కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్‌ విధించింది.

News June 14, 2024

HYD: సీఐకి 14 రోజుల రిమాండ్..!

image

HYD CCSలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ <<13435343>>సీహెచ్.సుధాకర్‌‌<<>> గురువారం రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా ACBఅధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకుని అందులో మొదట విడతగా రూ.5లక్షలు తీసుకున్నాడు. మరో రూ.3లక్షలు తీసుకుని పారిపోతుండగా ఛేజ్ చేసి అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం సుధాకర్‌ని విచారణ చేసి, నాంపల్లి ACB కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్‌ విధించింది.

News June 14, 2024

నారాయణపేట జిల్లాలో భూ హత్యపై హరీశ్ రావు ట్వీట్

image

ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు.. X వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

News June 14, 2024

నడిపల్లిలో మహిళా హత్య కేసును చేధించిన పోలీసులు

image

డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులోని చెరువులో ఈనెల 12న మృతిచెందిన పవర్ లలిత ది హత్యేనని డిచ్‌పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. లలిత భర్తతో గొడవపడి, నడిపల్లిలో గత కొన్ని ఏళ్లుగా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రాథోడ్ వినోద్ అనే వ్యక్తితో లలిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. లలితను ఎలాగైనా వదిలించుకోవాలని వినోద్ ఈనెల 12న నడిపల్లి శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్యచేశాడు.

News June 14, 2024

జగిత్యాల: సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం

image

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్ల వాగు సమీపంలో శుక్రవారం సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతదేహం సగానికి పైగా కాలిపోయి ఉండగా గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చి ఉంటారా లేదా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

News June 14, 2024

ఉట్కూర్ ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ

image

ఉట్కూర్ మండలం చిన్నపోర్లలో భూ తగాదాల కారణంగా దాయాదుల మధ్య జరిగిన దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉట్కూర్ ఎస్సై పట్టించుకోకపోవడం వల్లే ఇంత దారుణం జరిగిందని బాధితులు ఆరోపించారు. దీంతో శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.