Telangana

News June 14, 2024

BREAKING: HYD: అదృశ్యమైన బాలిక.. శవమై..!

image

అదృశ్యమైన ఓ బాలిక ఘటన విషాదాంతంగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD మియాపూర్ నడిగడ్డ తండాలో గత శుక్రవారం బానోతు వసంత(12) అనే బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అదృశ్యమైన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఈరోజు బాలిక మృతదేహం లభ్యమైంది. హత్య చేశారా? లేదా వేరే కారణం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజావాణి పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలి: కలెక్టర్

image

అర్జీలపై తక్షణమే స్పందిస్తూ, సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలకు సంబంధించి రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News June 14, 2024

HYD: లెటర్స్ ఇచ్చిన సీఎం.. పోస్టింగ్ ఇవ్వలేదు: అభ్యర్థులు

image

HYD ప్రజాభవన్ ఇన్‌ఛార్జ్ సంగీతతో పాటు చిన్నారెడ్డికి ఈరోజు గురుకుల అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందిన అభ్యర్థులు వినతి పత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తాము అపాయింట్‌మెంట్ లెటర్స్ తీసుకున్నామని, ఇప్పటివరకు తమకు పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు.అనంతరం నాంపల్లిలోని ట్రెబ్ ఛైర్మన్‌‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయం చేయాలని కోరారు.

బాలికను హత్యాచారం చేసిన నిందితుడిని అప్పజెప్పాలని నిరసన

image

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి <<13437328>>హత్యాచారానికి <<>>గురైన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. వివిధ పార్టీల నాయకులు పలువురు మహిళలు రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. హత్యాచారం చేసిన నిందితుడిని తమకు అప్పజెప్పాలని, రైస్ మిల్లు యాజమాన్యం దిగిరావాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

News June 14, 2024

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

అశ్వారావుపేట మండలం నారమువారిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందాగా.. మరో నలుగురికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలివచారు. మృతులు వెంకట లక్ష్మి, దుర్గారావుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

సార్వత్రిక ఫలితాల్లో సంగారెడ్డి ఫస్ట్.. సిద్దిపేట లాస్ట్

image

ఓపెన్(సార్వత్రిక) పది, ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. పదో తరగతితో 79.6% ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా ఫస్ట్ స్థానంలో నిల్వగా.. 77.95 %తో మెదక్ ద్వితీయ, 42.65% సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్‌లో సంగారెడ్డిలో 67.03 %, మెదక్ 60.16%, సిద్దిపేటలో 37.18% ఉత్తీర్ణత నమోదైనట్లు సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

News June 14, 2024

ఆదిలాబాద్: జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా చర్యలు: ఎస్ఈ

image

ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామని ఎస్ఈ జయవంత్ చౌహన్ తెలిపారు. నిర్లక్ష్యం, అవగాహన లోపం వలన విద్యుత్ వినియోగదారుల గృహాల్లోని నాణ్యమైన వైరింగ్ లేకపోవడం వల్ల, నాసిరకం విద్యుత్ పరికరాలు వాడటం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News June 14, 2024

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికికి ప్రమాదం: BJP

image

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని BJP రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం HYD హైదర్‌గూడలోని NSSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అన్నారు.