Telangana

News June 14, 2024

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికికి ప్రమాదం: BJP

image

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని BJP రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం HYD హైదర్‌గూడలోని NSSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

News June 14, 2024

దారుణం.. 9 ఏళ్ల బాలికపై పీహెచ్సీ ఉద్యోగి అత్యాచారం

image

భద్రాద్రి: 9 ఏళ్ల బాలికపై పీహెచ్సీ ఉద్యోగి అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. జానంపేట పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News June 14, 2024

ధరణి సమస్యలు పరిష్కరించాలి: సీసీఎల్ఏ

image

పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాలపై సమీక్షించి వాటిని పరిష్కరించడంపై ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్ మనూచౌదరి పాల్గొన్నారు.

News June 14, 2024

GHMC పరిధి విస్తరణకు అధికారుల కసరత్తు..!

image

HYD శివారులోని 7కార్పొరేషన్లు, 21మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి రాజధాని పరిధిని పెంచేందుకు MDCL, RRఅధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా CMరేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. జవహర్‌నగర్, ఘట్‌కేసర్, కొంపల్లి, మేడ్చల్, దుండిగల్, బడంగ్‌పేట్, శంషాబాద్, ఆదిభట్ల, పెద్దఅంబర్‌పేట్, బోడుప్పల్, నాగారం, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్ తదితర ప్రాంతాలు విలీనం కానున్నాయి.

News June 14, 2024

GHMC పరిధి విస్తరణకు అధికారుల కసరత్తు..!

image

HYD శివారులోని 7కార్పొరేషన్లు, 21మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి రాజధాని పరిధిని పెంచేందుకు MDCL, RRఅధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా CMరేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. జవహర్‌నగర్, ఘట్‌కేసర్, కొంపల్లి, మేడ్చల్, దుండిగల్, బడంగ్‌పేట్, శంషాబాద్, ఆదిభట్ల, పెద్దఅంబర్‌పేట్, బోడుప్పల్, నాగారం, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్ తదితర ప్రాంతాలు విలీనం కానున్నాయి.

News June 14, 2024

ఉమ్మడి జిల్లాలో చల్లబడ్డ వాతావరణం..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్లో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరులో 32.7, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 32.4, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 31.8, గద్వాల జిల్లా అల్వాలపాడు 29.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News June 14, 2024

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాల్లోని 229 ఉన్నత పాఠశాలల్లో జీహెచ్ఎంలు ఖాళీలు భర్తీ అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 16, నాగర్ కర్నూల్ -81, వనపర్తి-53, జోగులాంబ గద్వాల -30, నారాయణపేట-49 జీహెచ్ఎంలుగా ఖాళీలను భర్తీ చేశారు. ఎస్ఏల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే మిగిలిన ఖాళీలను అధికారులు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎస్టీల్లో పదోన్నతి కోసం అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ తాత్కాలిక జాబితా ప్రకటించారు.

News June 14, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు క్రింది విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా సెరివెంకటాపూర్ 15.0 మి.మీ, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 16.5 మి.మీ, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 14, 2024

MBNR: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన బీసీ మేధావుల సంఘం

image

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మహబూబ్ నగర్ జిల్లా బీసీ మేధావుల సంఘం నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ మేధావుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన చేపట్టాలని అలాగే ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న బీసీలను ఆదుకోవాలని కోరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

News June 14, 2024

HYD: గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100కి అవకాశం ఇవ్వాలని మంత్రికి వినతి

image

త్వరలో జరగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులను 1:50 గా కాకుండా 1:100గా ఎంపిక చేయాలని పలువురు నిరుద్యోగులు ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. 1:100కి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఎక్కువ అవకాశం కల్పించినట్లు అవుతందన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ CM దృష్టి తీసుకెళుతానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.