Telangana

News June 14, 2024

HYD: గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100కి అవకాశం ఇవ్వాలని మంత్రికి వినతి

image

త్వరలో జరగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులను 1:50 గా కాకుండా 1:100గా ఎంపిక చేయాలని పలువురు నిరుద్యోగులు ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. 1:100కి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఎక్కువ అవకాశం కల్పించినట్లు అవుతందన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ CM దృష్టి తీసుకెళుతానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

News June 14, 2024

న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణ కొరకు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులం న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూర్తి బయోడేటాతో పాటు ఈ సంవత్సరంలో కులం, ఆదాయం, డిగ్రీ మార్కుల జాబితా, బార్ కౌన్సిల్ నమోదు పత్రములు జత చేసి జులై ఆరులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 14, 2024

సిద్దిపేట: మహిళపై దాడి చేసి పుస్తెలతాడు చోరీ.. ఇద్దరి అరెస్ట్

image

ములుగు మండలం తునికి బొల్లారం వాసి శ్యామల శంకరమ్మ దాడి చేసి 4.50 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మేడ్చల్ జిల్లా నాగలూరుకి చెందిన లింగని రజినీకాంత్(23), ఈరగల్ల యాదగిరి(36)గా గుర్తించినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. శంకరమ్మ ఈనెల 11న ఉదయం వాకింగ్ చేస్తుండగా దాడి చేసి పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. తూప్రాన్‌లో అమ్ముతుండగా ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు.

News June 14, 2024

భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గౌతమ్

image

ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు కలెక్టర్ గౌతమ్ జిల్లాలో రైల్వే, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News June 14, 2024

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై సిసిఎల్ఎ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొని పెండింగ్ ధరణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.

News June 14, 2024

మరిపెడ రామాలయంలో ఖమ్మం ఎంపీ పూజలు

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని రామాలయాన్ని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామ సహాయం రఘురామిరెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రామచంద్ర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

News June 14, 2024

కొత్తగూడెం: 3 సంవత్సరాల్లో రూ.84 కోట్ల గంజాయి పట్టివేత

image

భద్రాచలం మీదుగా MH, తమిళనాడు, ఢిల్లీకి నిత్యం గంజాయి తరలిపోతోంది. 2021లో 74 కేసులు నమోదు చేసి 16,146 కిలోలు, 2022లో 50 కేసులు పెట్టి 24,000 కిలోలు, 2023లో 74 కేసులు నమోదు చేయడం ద్వారా 5,244 కిలోల, 2024లో మార్చి నాటికి 35 కేసులు పెట్టి 2,781 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో రూ.84 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 33,400 కిలోల గంజాయిని కాల్చారు.

News June 14, 2024

నల్గొండ: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్ రాయిని ఢీకొట్టడంతో డ్రైవర్ లక్ష్మీనారాయణ కింద పడ్డాడు. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మీనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 14, 2024

KMR: ఆటోలో మృతదేహం కలకలం.. అసలేం జరిగింది?

image

కామారెడ్డి జిల్లా పిట్లంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుకాల ఆటోలో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆటోలో దొరికిన పత్రాల ఆధారంగా మృతుడు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన చాకలి కాశీరాంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News June 14, 2024

ఇదే పాఠశాలలో చదివి ఎమ్మెల్యే అయ్యాను: అనిల్ జాదవ్

image

నేరడిగొండ మండలం రాజురా పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్‌లు అందజేసి చాక్లెట్లను పంచారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సూచించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవన పనులను పరిశీలించారు.