Telangana

News June 14, 2024

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎర్రబెల్లి

image

సోషల్ మీడియాలో తనపై వస్తున్న పార్టీ మార్పు ప్రచారాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. సోషల్ మీడియా వేదిక చేసుకుని కొంతమంది తనపై అసత్య ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు రాజకీయాల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ, పార్టీ మారే ఆలోచన లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

News June 14, 2024

KMR: రక్తదాన దినోత్సవం.. 73 సార్లు రక్త దానం చేసిన బాలు

image

KMR జిల్లాకు చెందిన డా.బాలు రక్త దాతల సమూహాన్ని 2007లో ఏర్పాటు చేశారు. వాట్సప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఆపదలో ఉన్న వారికి వీరు రక్తం అందిస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2yrsలో 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఫలితంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు డా. బాలు 73 సార్లు రక్త దానం చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

News June 14, 2024

NLG: ఆ జిల్లాలో బాలికల సంఖ్య తక్కువే!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం క్రమంగా పెరుగుతోంది. ఎంసీ‌హెచ్ (మదర్, చైల్డ్ హెల్త్) కిట్ల పంపిణీ ద్వారా సేకరించిన లెక్కల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా బాలబాలికల నిష్పత్తి సమానంగా లేదు. నల్గొండ జిల్లాలో వెయ్యి మంది బాలురకు 924 మంది బాలికలు, సూర్యాపేటలో 897, యాదాద్రిలో 911 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

News June 14, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 ధర పలికింది. 341 రకం మిర్చికి రూ.16,500 ధర వచ్చింది. వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.17,500 ధర, టమాటా మిర్చి రూ.25వేల ధర వచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా ధరలు పెరిగాయి.

News June 14, 2024

గుమ్మడిదల: రోడ్డు ప్రమాదంలో బైక్ మెకానిక్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్‌ను ఢీకొని బైక్ మెకానిక్ మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండలంలో నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన గణేష్(31) బైక్ మెకానిక్. నిన్న రాత్రి తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం తిరిగి కారులో ఇంటికి వస్తుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

News June 14, 2024

MHBD: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

image

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతు గూడెం తండాలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గత వారం భర్త రవి సంగెం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక భార్య సరిత గురువారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 14, 2024

3 సంవత్సరాల్లో 84 కోట్ల గంజాయి పట్టివేత

image

భద్రాద్రి జిల్లాలో భద్రాచలం మీదుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ కి నిత్యం గంజాయి తరలిపోతోంది. 2021లో 74 కేసులు నమోదు చేసి 16,146 కిలోలు, 2022లో 50 కేసులు పెట్టి 24,000 కిలోల, 2023లో 74 కేసులు నమోదు చేయడం ద్వారా 5,244 కిలోల, 2024లో మార్చి నాటికి 35 కేసులు పెట్టి 2,781 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో రూ.84 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. 33,400 కిలోల గంజాయిని కాల్చారు.

News June 14, 2024

KNR: పిల్లలతో పాటు చెరువులో దూకిన తల్లి

image

ఓ తల్లి పిల్లలను చెరువులోకి విసిరేసి తానూ దూకిన ఘటన అమీన్పూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. KNR జిల్లా తిమ్మాపూర్ మం. నుస్తులాపూర్‌కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి ఐటీ ఉద్యోగాలు చేస్తూ చందానగర్లో ఉంటున్నారు. పిల్లల్ని చూసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన శ్వేత పిల్లల్ని చెరువులోకి విసిరేసి తానూ దూకింది. ఈ ఘటనలో బాబు మృతి చెందగా తల్లి కూతుళ్లను పోలీసులు కాపాడారు.

News June 14, 2024

నాగర్ కర్నూల్: విద్యార్థి అడవిలో ఆత్మహత్య.!

image

లింగాల మండలంలోని రాంపూర్ పెంటకు చెందిన రాముడు (14) సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారితే పాఠశాలకు వెళ్లే ఆ విద్యార్థి రాముడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. రాముడు బలవన్మరణంపై పలు అనుమానం ఉందని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

KNR: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి

image

ఇసుక ట్రాక్టర్ ఢీకొని భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. విలాసాగర్‌కు చెందిన రాజయ్య(48), దామెరకుంటకు చెందిన బాపు(45) బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో రుద్రారానికి చెందిన శ్రీనివాస్ కూతురిని తీసుకొని బైకుపై వస్తుండగా.. దుబ్బపల్లి సమీపంలో వీరి బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అదే సమయంలో అతి వేంగా వచ్చిన ట్రాక్టర్ రోడ్డపై పడి ఉన్న రాజయ్య, బాపు పైనుంచి పోవడంతో మృతి చెందారు.