Telangana

News June 14, 2024

ఖమ్మం: తగ్గిన మిర్చి ధర.. స్థిరంగా ఉన్న పత్తి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర 100 రూపాయల తగ్గగా.. పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు.

News June 14, 2024

NLG: జిల్లాలో 129 మంది SAలకు పదోన్నతులు

image

నల్గొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా మల్టీజోన్ పరిధిలో 129 మందికి పదోన్నతి లభించింది. 4 రోజుల క్రితం విద్యాశాఖ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది. సీనియారిటీ జాబితా ప్రకారం జిల్లాలో 129 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు వచ్చాయి. జిల్లా లో ఖాళీగా ఉన్న 109 పోస్టులకు 87 పోస్టులను జిల్లా నుంచి పదోన్నతులు పొందిన వారికి కేటాయించారు.

News June 14, 2024

తాడ్వాయి: ఏడేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి

image

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఏడేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈదాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సోమారం తండాకు చెందిన శైలజ అనే బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 14, 2024

BNG: పదోన్నతుల ద్వారా HMల పోస్టుల భర్తీ

image

యాదాద్రి భువనగిరి జిల్లాలోని 83 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యాయి. పదోన్నతులు ఉత్తర్వులు పొందిన 83 మందిలో 82 మంది గురువారం విధుల్లో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు విధుల్లో చేరలేదు. జిల్లాలోని 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి లభించగా ఇందులో 53 మంది ఎస్ఏలకు జిల్లా పరిధిలోనే పోస్టింగులు దక్కాయి.

News June 14, 2024

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.55వేల ఫైన్ విధిస్తూ ఖమ్మం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఉమాదేవి గురువారం తీర్పు నిచ్చారు. రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాంపాటి కార్తీక్(20) గతేడాది మార్చి 5న ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాలు పరిశీలించిన అనంతరం జడ్జి తీర్పు నిచ్చారు.

News June 14, 2024

NLG: హైవే అంటే భయపడుతున్న వాహనదారులు

image

హైదరాబాద్ – విజయవాడ హైవేపై దారి దోపిడీలు, హత్యలు, దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. రెండు నెలల కాలంలో పలు దోపిడీలు, దొంగతనాలు జరగడంతో రాత్రిపూట ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. చౌటుప్పల్లో గతంలో ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీ లింగోటం వద్ద లారీని ఆపి డ్రైవర్ ను తాళ్లతో కట్టి నగదు చోరీ చేశారు. గత నెల 18న ఎరసానిగూడెం వద్ద లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు.

News June 14, 2024

BREAKING.. పెద్దపల్లి: ఆరేళ్ల బాలికపై హత్యాచారం

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆరేళ్ల బాలికపై బుధవారం రాత్రి వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. స్థానికుల ప్రకారం.. ఓ రైస్‌మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను రైస్‌మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. బాలికలేదని తల్లి గుర్తించి తోటి కార్మికులతో కలిసి వెతకడంతో విషయం బయటపడింది. నిందితుడిని రైస్ మిల్లు కార్మికులు పోలీసులకు అప్పగించారు.

News June 14, 2024

SRPT: వివాహేతర సంబంధం.. చిన్నారి హత్య.. అరెస్టు

image

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన ప్రియురాలి కుమార్తెను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న నల్గొండ జిల్లా ఐలాపురంలో 22 నెలల చిన్నారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నవ్య శ్రీ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి అరవింద్ రెడ్డితో ఐలాపురంలో నివాసం ఉంటోంది.

News June 14, 2024

విత్తనాలు నాటేందుకు రైతుల ఎదురు చూపు

image

ఖమ్మం జిల్లాలో పత్తి ప్రధాన పంటగా సాగవుతోంది. అయితే, 60 మి.మీ. కనీస వర్షపాతం నమోదైతేనే విత్తనాలు విత్తేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ మేరకు వర్షం కురవలేదు. ఈ ఏడాది జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 24,313 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు నాటగా.. పూర్తిస్థాయిలో వర్షం కురిస్తేనే మిగతా రైతులు నాటే అవకాశముంది.

News June 14, 2024

జిల్లా వ్యాప్తంగా చల్లబడిన వాతావరణం

image

ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడగా ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఖమ్మం అర్బన్ మండలం ఖానాపురంలో 51.5 మి.మీ. ఎన్నెస్పీ గెస్ట్ హౌస్ ప్రాంతంలో 45 మి.మీ., ప్రకాశనగర్లో 8.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, కామేపల్లి, మధిర మండలంలోని పలు ప్రాంతాల్లో సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.