Telangana

News June 14, 2024

మంచిర్యాల: చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్య

image

మంచిర్యాల పట్టణం NTRనగర్‌కు చెందిన రవికుమార్(28) ఆత్మహత్య చేసుకున్నట్లు SI ప్రశాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవికుమార్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కూలి డబ్బులు సరిపోక అప్పులు చేశాడు. అప్పు చెల్లించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

News June 14, 2024

గొర్రెల యూనిట్ల డీడీల వాపస్ ప్రక్రియ ప్రారంభం: శ్రీనివాసరావు

image

గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించిన లబ్దిదారులు డీడీల వాపస్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వెంటనే డబ్బులు బ్యాంకు ద్వారా వారి ఖాతాల్లో జమ చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ అనుమతితో 800 మంది లబ్ధిదారులకు డీడీ డబ్బులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు.

News June 14, 2024

NZB: అఫైర్.. చిన్నారి హత్య.. అరెస్టు

image

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన ప్రియురాలి కుమార్తెను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న నల్గొండ జిల్లా ఐలాపురంలో 22 నెలల చిన్నారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నవ్య శ్రీ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి అరవింద్ రెడ్డితో ఐలాపురంలో నివాసం ఉంటోంది.

News June 14, 2024

ఈనెల 18న వరంగల్ నిట్‌లో ఓపెన్ హౌస్

image

జేఈఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 18న నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జేఈఈలో అర్హత సాధించి ఇంజినీరింగ్ కళాశాలను ఎంచుకునేందుకు గాను ఈ అవగాహన తోడ్పడుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అవగాహన నిర్వహించనున్నారు. నిట్ వరంగల్ ప్రత్యేకతనూ తెలియజేయనున్నారు.

News June 14, 2024

HYD: బాలాపూర్‌లో మర్డర్

image

బాలాపూర్ PS పరిధి రాయల్ కాలనీలో దారుణం జరిగింది. చంపాపేట్ బాబానగర్‌కు చెందిన సయ్యద్ సమీర్‌(28) హత్యకు గురయ్యాడు. రాయల్ కాలనీ వద్ద గుర్తుతెలియని దుండగులు చంపేశారు. డెకరేషన్ చేసి ఇంటికి వస్తుండగా స్థానిక గంజాయి బ్యాచ్‌ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

PDPL: ప్రతి ఉద్యోగి ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలి: కలెక్టర్

image

ప్రతి ఉద్యోగి ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. గురువారం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఉద్యోగి కాంపౌండింగ్‌ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు కోసం ఆదా చేసే సొమ్ము మార్కెట్‌లో పెట్టుబడిగా పెడితే మంచి రిటర్న్ వస్తాయని తెలిపారు.

News June 14, 2024

KNR: పెరిగిన ధరలు.. మునగ రూ.120, టమాట రూ.60

image

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా దిగుబడి తగ్గడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయి. KNRతో పాటు GDK, హుస్నాబాద్, హజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల తదితర ప్రాంతాలకు KNR హోల్‌సేల్ మార్కెట్ నుంచి సరఫరా అవుతుంటాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మునగ కిలోకు రూ.60 ఉన్న ధర రూ.120కి చేరింది. కిలో రూ.20-30 ఉన్న టమాట.. ప్రస్తుతం రూ.60కి చేరింది.

News June 14, 2024

WGL: మద్యం మత్తులో సిబ్బంది?

image

బాలురను నిరంతరం పర్యవేక్షించాల్సిన సిబ్బంది మద్యం మత్తులో మునిగి తేలిన ఘటన WGL బాలుర పరిశీలన గృహం(అబ్జర్వేషన్ హోం)లో జరిగింది. ఉన్నతాధికారుల ప్రకారం.. జూన్ 2న ఉప సంచాలకుడు పరిశీలన గృహాన్ని తనిఖీ చేయగా.. పర్యవేక్షిడితో పాటు కింది స్థాయి సిబ్బంది మద్యం మత్తులో మునిగి ఉన్నారు. వారితో మాట్లాడుతుండగా మత్తులో తూగుతుండటం గమనార్హం. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని జూన్ 3న సంచాలకుల కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

News June 14, 2024

రుణమాఫీ.. పాలమూరులో ఇదీ పరిస్థితి

image

ఆగస్టు 15లోగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామనడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల బాకీలు తీరుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి. గత ప్రభుత్వం రూ.లక్ష వరకు విడతల వారీగా రుణమాఫీ చేసింది. ముందుగా రూ.50వేల లోపు వారికి, రూ.99 వేల వరకు మాఫీ చేసింది. తాజాగా సీఎం ఆదేశాలతో అధికారులు గైడ్ లైన్‌పై దృష్టి పెట్టారు.

News June 14, 2024

RAINS: హైదరాబాద్‌‌‌లో మెట్రో ఇక ఆగదు!

image

వర్షాకాలంలో‌ మెట్రో‌ రైలు‌ సేవల్లో అంతరాయం లేకుండా‌ అధికారులు‌ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం బేగంపేటలో‌ L & T HYD మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్ తదితరులతో ఎండీ NVSరెడ్డి సమావేశమయ్యారు. ట్రాన్స్‌ కో ఫిడర్ ట్రిప్ అయితే ప్రత్యామ్నాయంగా మరొక ఫీడర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. నీటి పైపులను క్లీన్ చేయడం, జాయింట్ల తనిఖీ, ఎస్కలేటర్ల వద్ద నీరు నిలువకుండా జాగ్రత్త‌ పడాలని సూచించారు