Telangana

News June 14, 2024

సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు

image

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

News June 14, 2024

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచండి: కలెక్టర్ ఉదయ్

image

ప్రభుత్వం బడుల్లో అన్ని వసతులు కల్పించడమే కాక అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందుతుందని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ అన్నారు. గురువారం ఉప్పునుంతలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఆమ్మ ఆదర్శ బడుల్లో పనులపై వెంటనే నివేదికలు సమర్పించాలన్నారు.

News June 14, 2024

ఎంపీ సురేష్ షెట్కర్‌ని సన్మానించిన మంత్రి పొన్నం

image

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సురేష్ షెట్కర్ గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన సురేష్ షెట్కర్‌ని శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గలం విప్పాలని తెలిపారు. తెలంగాణ పక్షాన పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తారని ఆశిస్తున్నానన్నారు.

News June 14, 2024

ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ జిల్లా అధికారులు ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండుగను ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్యం, అలాగే అవసరమైన నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని వేస్ట్‌ను దూరంగా ఉంచి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలని అన్నారు.

News June 14, 2024

కామారెడ్డి: కాంగ్రెస్ నేతలను కలిసిన ఎంపీ

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించినందుకు వారు ఆయన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News June 14, 2024

వనపర్తి: UPSC శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో రాష్ట్రలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖచే UPSC నిర్వహించే సివిల్స్ సర్వీసెస్ పరీక్ష-2025 శిక్షణకు ఆసక్తి గల వారు https://studaycircle.cgg.gov.in లో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News June 14, 2024

ఖమ్మం: వేల కోట్లు ఖర్చు చేసినా కేసీఆర్ నీరు ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం

image

సీతరామ సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మలతో కలిసి ప్రాజెక్ట్‌ను భట్టి సందర్శించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎన్కూర్ లింక్ కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసి ఆగస్టు నాటికి లక్ష 20వేల ఎకరాలకు నీరు అందిస్తామని భట్టి పేర్కొన్నారు.

News June 14, 2024

ఆదిలాబాద్: కేంద్ర మంత్రిని కలిసిన మాజీ మంత్రి

image

ఆదిలాబాద్ జిల్లా బంజారా సేవ సంఘ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గురువారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంట్ ఎంపీ కింజరాపు రామ్ మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News June 14, 2024

HYD: గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచాలి: గుజ్జ సత్యం

image

గ్రూపు-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా HYD కాచిగూడలో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-2 ఎక్సైజ్ ఎస్ఐ ఎత్తు 167.6 నుంచి 165కు తగ్గించాలని, డీఎస్సీ పరీక్షను ఆఫ్ లైన్‌లో నిర్వహించాలని కోరారు. ఎంతో మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

News June 14, 2024

హాట్‌టాపిక్‌గా ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు

image

మెదక్‌లో జరిగిన విజయోత్సవ సభలో బీఆర్ఎస్ నేతలపై ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారినాయి. మాజీ సీఎం KCRపై ఇప్పుడే ఈడీ కేసు నమోదైందని, త్వరలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై ఈడీ ఎఫెక్ట్ ఉంటుందని, రూ.500 కోట్లు ఖర్చుపెట్టినా వెంకట్రామిరెడ్డి గెలవలేదన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై జిల్లాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మీ కామెంట్..