Telangana

News August 29, 2025

NLG: నైపుణ్య విద్య.. రేపటి వరకే చాన్స్!

image

గ్రామీణ విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను వెలికి తీసేందుకు నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నైపుణ్య విద్యలో శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించింది. రేపటి వరకు చాన్స్ ఉన్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ కోరుతున్నారు.

News August 29, 2025

మెదక్లో అత్యధికంగా 11.3 సెంమీ వర్షం

image

జిల్లాలో అత్యధికంగా మెదక్‌లోనే 11.3 (113.3 మిమీలు) సెంమీ వర్షం కురిసింది. డివిజన్ కేంద్రం నర్సాపూర్లో 103.3 మిమీలు, సర్ధనలో 96.8, శివునూరులో 95.3, చేగుంటలో 78.5, రామాయంపేటలో 61.5, పాతూరులో 56.8, పెద్ద శంకరంపేటలో 51.3 మిమీల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు కూడా మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

News August 29, 2025

MBNR: కొత్తపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 85.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్జిల్ 63.3, జడ్చర్ల 34.3 మహబూబ్ నగర్ అర్బన్ 21.5, భూత్పూర్ 19.5, చిన్నచింతకుంట 13.3, కౌకుంట్ల 10.5, కోయిలకొండ మండలం పారుపల్లి 10.0, బాలానగర్ 8.5, మూసాపేట 5.8, దేవరకద్ర, హన్వాడ 3.8, మిల్లీమీటర్ల వాన పడింది.

News August 29, 2025

HYD: డ్రగ్స్ ముఠాల వలలో మహిళలు!

image

డ్రగ్స్..జీవితాలను అల్లకల్లోలం చేసే పెనుభూతం. మహానగరంలో డ్రగ్స్ ముఠాల చేతుల్లో మహిళల జీవితాలు బలవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. 7 నెలల్లో దాదాపుగా 100 మందికిపైగా మహిళా బాధితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వంటి వాటి వైపు వీరు మరలుతున్నట్లు తెలుస్తోంది. ఒంటరి జీవితం, హై రేంజ్ ఉద్యోగం, భర్తతో వైరం, జీవితంపై విరక్తి, నివసించే పరిసరాలు దీనికి కారణాలుగా వెల్లడైంది.

News August 29, 2025

NLG: సెప్టెంబర్ 4 వరకు పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో చేయూత పింఛన్లను సెప్టెంబర్ 4వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్టు తెలిపారు. పెన్షన్ దారులంతా రూ.16 చిల్లరను అడిగి తీసుకోవాలని పేర్కొన్నారు. మధ్య దళారులను నమ్మకూడదని సూచించారు.

News August 29, 2025

మూసారాంబాగ్ వంతెన వద్ద డేంజర్

image

మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మూసారాంబాగ్ వంతెన వద్ద నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగింది. గండిపేట ఉస్మాన్‌సాగర్ నుంచి 6 గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులు, హిమాయత్‌‌సాగర్ నుంచి 2 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,270 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. GHMC, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై& సీవరేజ్ బోర్డ్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

News August 29, 2025

హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

image

HYDలో పలు ప్రాంతాల నుంచి వచ్చే గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని నేటి నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఆయా రోజుల్లో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి NTR మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, PVNR మార్గ్‌లో మ.3 నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని తెలిపారు. దీన్ని బట్టి నగరవాసులు ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి.

News August 29, 2025

ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలి: కలెక్టర్

image

పిల్లలు లేనివారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేరా నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ జరగాలని ఆయన స్పష్టం చేశారు. బంధువుల పిల్లలైనా, ఇతరుల పిల్లలైనా నిబంధనలను పాటించకుండా దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, దత్తత ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని పేర్కొన్నారు.

News August 29, 2025

NLG: ముసాయిదా ఓటరు జాబితా విడుదల

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. తుది ఓటరు జాబితా తయారీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జిల్లాలోని 869 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గురువారం జాబితాను విడుదల చేశారు.

News August 29, 2025

మన్నూర్ కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్

image

గుడిహత్నూర్ మండలంలో కిడ్నాప్ కలకలం రేపింది. మన్నూర్‌కు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శివ ప్రసాద్‌ను 26వ తేదీన రాత్రి కొంతమంది కిడ్నాప్ చేసి ఇచ్చోడ వైపు తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్‌లు సెల్ లొకేషన్ ఆధారంగా అతడిని రక్షించారు. విచారణలో వ్యక్తిగత వైరం కారణంగా ఈ కిడ్నాప్ చేసినట్లు సీఐ రాజు తెలిపారు. నిందితులు సురేశ్, రవి, వెంకటి, పరేశ్వర్, నామదేవ్, గజనంద్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు.