Telangana

News June 13, 2024

ఖమ్మం: బావిలో పడి రైతు మృతి

image

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం ముదిగొండ మండలంలో చోటు చేసుకుంది. చిరుమర్రి గ్రామానికి చెందిన గాలి హనుమంతరావు(38) అనే రైతు మంచినీళ్లు తెచ్చేందుకు వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా ఫీట్స్ రావడంతో బావిలో పడి ఊపిరాడక మృతి చెందాడు. హనుమంతరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News June 13, 2024

గాదిగూడ: ‘చెట్టు కింద బడి.. అధికారుల నిర్లక్ష్యం’

image

గాదిగూడలోని ధర్మగూడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూలిపోయింది. ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలో లేదని గ్రామస్థులు వాపోయారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక CRT ఉపాధ్యాయులచే చెట్టు కిందనే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల నిర్మించాలని కోరారు.

News June 13, 2024

పరకాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ

image

పరకాల నియోజకవర్గంలోని ఓ కన్వెన్షన్‌లో కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ-అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునాదిని నిర్మించే బాధ్యత మనందరి పైన ఉందని, పరకాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.

News June 13, 2024

కొడంగల్‌కు రూ.73.45 కోట్లు మంజూరు

image

సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి భారీగా నిధులు మంజూరు చేశారు. బీసీ గురుకుల విద్యాలయాల నిర్మాణానికి రూ.73.45 కోట్లు మంజూరు చేశారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీకి రూ.25 కోట్లు, పాఠశాలకు రూ.23.45 కోట్లు, బూరాన్‌పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేశారు.

News June 13, 2024

NLG: ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అడ్డుకోరా?

image

ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లు నిలువు దోపిడీ చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మధ్యమధ్యలో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్స్‌కు మరికొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

News June 13, 2024

HYD: GET READY.. మరో 2 గంటలు భారీ వర్షం

image

HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. SHARE IT

News June 13, 2024

HYD: GET READY.. మరో 2 గంటలు భారీ వర్షం

image

HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. SHARE IT

News June 13, 2024

మంచిర్యాలలో గోడ కూలి ముగ్గురు మృతి

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతిచెందినవారిలో ఇద్దరిని శంకర్, హనుమంతుగా గుర్తించారు. కాగా మరో కూలీ పోషన్న శిథిలాల కింద చిక్కుకున్నాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

రేపు జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు: మంత్రి

image

రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మేరకు బ్లడ్ బ్యాంకుల నిర్వహణ – బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలను పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

News June 13, 2024

ఫోన్ ట్యాపింగ్ బాధ్యులకు కటకటాలే: మంత్రి జూపల్లి

image

ఫోన్ ట్యాపింగ్‌కు కారణమైన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు, రాజకీయ నేతలు కటకటాల్లోకి వెళ్లక తప్పదని పర్యాటక, ఆబ్కారీ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డా.మల్లురవి విజయం సాధించడంతో బుధవారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే ప్రజా భవన్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా మంత్రి పాల్గొని మాట్లాడారు.