Telangana

News June 13, 2024

క్లోరిన్ గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత

image

దుమ్ముగూడెం మండలం పర్ణశాల జంక్షన్లో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టులో క్లోరిన్ గ్యాస్ లీకవడంతో ముగ్గురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరు రక్తపు వాంతులు చేసుకున్నారు. మరోకరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. పంప్ హౌస్లో ఏర్పాటు చేసిన క్లోరిన్ ట్యాంక్ మారుస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా శబ్దం రావడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

News June 13, 2024

MBNR: సాగు లేక.. ధరలు మండిపోతున్నాయి

image

ఉమ్మడి జిల్లాలో స్థానికంగా సాగు లేక.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కూరగాయల ధరలు మండి పోతున్నాయి. వారం క్రితం ఉన్న వాటికి ప్రస్తుతానికి ధరల్లో చాలా తేడా ఉంటోంది. కొనుగోలు చేసేందుకు వినియోగదారులు లబోదిబోమంటున్నారు. రైతులు ఎక్కువగా వరి సాగు వైపు మొగ్గు చూపడంతో కూరగాయలు అరకొర సాగవుతున్నాయి. దశాబ్దకాలం నుంచి వీటికి ప్రభుత్వం రాయితీ నిలిచిపోవడంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు.

News June 13, 2024

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బ్యారేజీని పరిశీలించిన మంత్రులు

image

దుమ్ముగూడెం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బ్యారేజిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న అధికారులను ప్రాజెక్టు వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

News June 13, 2024

MDK: పిల్లలతో సహా చెరువులో దూకిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్వేతకు తన భర్తకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్వేత ఇద్దరు పిల్లలతో కలిసి అమీన్‌పూర్ పెద్ద చెరువులో దూకింది. బాలుడు శ్రీహాన్స్ మృతదేహం లభించగా బాలిక శ్రీహ, తల్లి శ్వేత మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News June 13, 2024

ఖమ్మం: పెళ్లి కార్డుపై పవన్ కళ్యాణ్ ఫోటో

image

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబరావు పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని వినుత్నంగా చాటుకున్నాడు. ఈనెల 18న కుటుంబరావు పెళ్లి ఉండగా పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో తన పెళ్లి పత్రికపై జనసేన, అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు ఖమ్మం జిల్లాలో వైరల్‌గా మారింది.

News June 13, 2024

నల్గొండ: ప్రాణం తీసిన చేపల వేట 

image

నల్గొండ జిల్లాలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మరణించగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన చందనపల్లిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

బిక్కనూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

image

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన బిక్కనూరులో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఆకుల నర్సింలు (56) నిన్న బుధవారం చేపల వేటకై బొబ్బిలి చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈతరాక మృతి చెందాడు. కాగా ఇవాళ మృతదేహం బయటకు తేలింది. మృతుడి భార్య కిష్టవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 13, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.17వేల ధర వచ్చింది. వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17,500 ధర వచ్చింది. కాగా, నేడు మార్కెట్‌కు మిర్చి తరలి వచ్చింది.

News June 13, 2024

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..
కాటారం మండలం దుబ్బపల్లి-విలాసాగర్ గ్రామాల మధ్య ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందిగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు దామెర కుంటలోని ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

News June 13, 2024

‘కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను పేదలకు పంచుతాం’

image

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను బయటకు తీసి పేదలకు పంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం చిన్నతండా, పెద్దతండా, నాయుడుపేటలో ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొద్ది రోజుల్లోనే ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లల్లో పైరవీలకు తావు లేకుండా అర్హులకు మాత్రమే ఇళ్లను ఇస్తామన్నారు.