Telangana

News June 13, 2024

MBNR: ఎమ్మెల్సీగా నవీన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నవీన్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుప్తా సుఖేందర్రెడ్డి నవీన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ ఆలీ తదితరులు ఉన్నారు.

News June 13, 2024

తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం

image

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News June 13, 2024

KNR: నేటి నుంచి డీలక్స్ బస్సు సర్వీసులు

image

వరంగల్ నుంచి నిజామాబాద్ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి డీలక్స్ బస్సులు నడపనున్నట్లు కరీంనగర్ రీజియన్ ఆర్ఎం సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో డీలక్స్ బస్సులను అదనంగా నడుపుతున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News June 13, 2024

తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం

image

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News June 13, 2024

తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం 

image

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News June 13, 2024

NGKL: బట్టల షాపులో యువకుడు సూసైడ్

image

నాగర్ కర్నూల్‌లోని ఓ బట్టల దుకాణంలో బుధవారం అర్ధరాత్రి ఓ యువకుడు ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల.. బొందలపల్లి గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి (25) 4 నెలల క్రితం జిల్లాకేంద్రంలోని నాగనూల్ చౌరస్తాలో బట్టల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే దుకాణంలో ఉరి వేసుకుని మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

MBNR: 10.58 లక్షల మంది రైతులు.. 19.44 లక్షల ఎకరాల్లో సాగు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఖరీఫ్‌లో దాదాపు 10,58,774 మంది రైతులు 19.44,642 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా. ఈ సీజన్లో ప్రతి ఏటా అంచనాకు మించి పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 2,12,644 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. అధిక మొత్తంలో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పంటల సాగు ఊపందుకోనుంది.

News June 13, 2024

ఖాళీగా ఉన్న షాపులకు టెండర్లు: రీజినల్ మేనేజర్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ పరిధిలో ఉన్న అన్ని బస్ స్టేషన్లో ఖాళీగా ఉన్న షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ఆసక్తి గలవారు TGSRTC వెబ్ సైట్ www.tgsrtc.telangana.gov.in (tender)లో అప్లై చేయాలన్నారు. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 99635 07506 నంబర్‌ను సంప్రదించాలని, టెండర్ నోటిఫికేషన్ ఈనెల 18 తారీఖున ముగుస్తుందని చెప్పారు.

News June 13, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు

News June 13, 2024

MBNR: పెట్టు బడి సాయం కోసం రైతుల ఎదురు చూపులు

image

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వడంతో కౌలు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా మహబూబ్ నగర్‌లో 2.10, నాగర్ కర్నూల్ – 3.01, నారాయణపేట- 1.71, వనపర్తి -1.68, జోగుళాంబ గద్వాల-1.63 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. కౌలు రైతులకు సాయం అందిస్తే ఈ సంఖ్య పెరగనుంది.