Telangana

News June 13, 2024

ఆదిలాబాద్‌లో మహిళ మృతదేహం

image

ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. వివరాలకు వెళ్తే గురువారం ఉదయం పట్టణంలోని ఖుర్షీద్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఒక మహిళ మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది. సమాచారం తెలుసుకున్న DSP జీవన్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక రిమ్స్ మార్చురీకి తరలించారు. మహిళ ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

పెద్దపల్లి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువతి వారం రోజుల కిందట పెద్దపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని విచారణ అనంతరం తెలుపుతామని ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు

News June 13, 2024

WGL: బస్సు ముందు కూర్చొని మహిళ నిరసన

image

ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డం తిరిగి రోడ్డుపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-MHBDకు వెళ్లే ఆర్టీసీ బస్సులో తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగారు. ఇంతలో డ్రైవర్ బస్సును పోనిచ్చాడు. సదరు మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

News June 13, 2024

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం

image

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణం చేయనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఖమ్మం- నలగొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు.

News June 13, 2024

అందోల్ మండల పంచాయతీ అధికారిణి సస్పెండ్

image

అందోలు మండల పంచాయతీ అధికారిణి(MPO) సౌజన్యను సస్సెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారని MPDO రాజేశ్ కుమార్ తెలిపారు. MPO పని తీరుపై ఇటీవల మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు చేయడం, ఇతరత్రా కారణాలపై జిల్లా కలెక్టర్ ఖేడ్ DLPO సంజీవరావుతో విచారణ చేయించారు. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు MPDO తెలిపారు.

News June 13, 2024

నల్గొండ: చిన్నారి దారుణ హత్య

image

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. NZB జిల్లా రెంజల్ మండలానికి చెందిన నవ్యశ్రీకి అదే మండలానికి చెందిన లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి అరుణ్య, మహన్వి(22నెలలు) కుమార్తెలున్నారు. 7 నెలల క్రితం అరవిందరెడ్డి అనే వ్యక్తితో నవ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి చిన్నారులతో నల్గొండ జిల్లాకు వచ్చి ఉంటోంది. తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి హతమార్చాడు.

News June 13, 2024

MBNR: TETలో 13,399 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు HYDలో బుధవారం విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేపర్-1కు 17,610 మంది, పేపర్-2కు 11,935 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-1లో 15,516 మంది అభ్యర్థుల్లో 10,458 మంది (67.40 శాతం ఉత్తీర్ణత) అర్హత సాధించారు. టెట్ పేపర్-2లో 9,936 మంది అభ్యర్థుల్లో 2,941 మంది (29.59 శాతం ఉత్తీర్ణత) అర్హత సాధించారు.

News June 13, 2024

NZB: చిన్నారి దారుణ హత్య

image

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. NZB జిల్లా రెంజల్ మండలానికి చెందిన నవ్యశ్రీకి అదే మండలానికి చెందిన లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి అరుణ్య, మహన్వి(22నెలలు) కుమార్తెలున్నారు. 7 నెలల క్రితం అరవిందరెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి చిన్నారులతో నల్గొండ జిల్లాకు వెళ్లి నివాసం ఉంటోంది. తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి హతమార్చాడు.

News June 13, 2024

మహబూబ్ నగర్: సీనియార్టీ జాబితా విడుదల

image

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, పదోన్నతుల ప్రక్రియ వడివడిగా కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం నాటికి హెచ్ఎంలకు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో స్కూల్ అసిస్టెంట్ల ప్రక్రియ ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సీనియార్టీ జాబితాను వెలువరించినట్లు డీఈఓ రవీందర్ పేర్కొన్నారు. జాబితాను www.palamurubadi.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉందన్నారు.

News June 13, 2024

HYD: నగరంలో భయంకరమైన ముఠా!

image

రాత్రి సమయంలో హయత్ నగర్ శివారు రాచకొండ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో  ధార్ అనే భయంకరమైన ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ గ్యాంగ్ ఐదుగురికి పైగా దొంగల ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాల్లో  రాత్రి దొంగతనాలు చేస్తారు. ఇంట్లోకి ప్రహరీ ద్వారా ప్రవేశించి డోర్ కొట్టి ఇంట్లో వారిని హత్య చేసి మరీ దోచుకెళ్తారని పోలీసులు చెప్పారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.