Telangana

News June 13, 2024

HYD: నగరంలో భయంకరమైన ముఠా!

image

రాత్రి సమయంలో హయత్ నగర్ శివారు రాచకొండ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో ధార్ అనే భయంకరమైన ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ గ్యాంగ్ ఐదుగురికి పైగా దొంగల ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాల్లో రాత్రి దొంగతనాలు చేస్తారు. ఇంట్లోకి ప్రహరీ ద్వారా ప్రవేశించి డోర్ కొట్టి ఇంట్లో వారిని హత్య చేసి మరీ దోచుకెళ్తారని పోలీసులు చెప్పారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News June 13, 2024

యాదాద్రి: ట్రాన్స్ఫార్లు, ప్రమోషన్ల కోసం 2130 మంది అప్లికేషన్లు

image

యాదాద్రి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్​కలిపి 712 స్కూల్స్​ఉన్నాయి. వీటిల్లో 3,465 టీచర్​పోస్టులు ఉండగా 2,800 మంది పనిచేస్తున్నారు. వీరిలో 2,130 మంది ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం అప్లయ్​ చేసుకున్నారు. వారి సర్వీస్​రిజిస్ట్రర్లను​ ఆఫీసర్లు పరిశీలించి ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లకు సంబంధించి లెక్కలు తేల్చనున్నారు. జిల్లాలో163 మంది గెజిటెడ్​హెడ్మాస్టర్లకు 75 మంది పని చేస్తున్నారు.

News June 13, 2024

హాజీపూర్: గుప్త నిధుల కోసం తవ్వకాలు..!

image

హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధి గొల్లపల్లి శివారులోని అతి పురాతన కాలంనాటి మాడుగు మల్లన్న స్థల ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. నాలుగు రోజుల క్రితం అర్థరాత్రి దాటిన తర్వాత కొంతమంది ఆ ప్రాంతంలో తవ్వకాలు  జరిపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

News June 13, 2024

వెల్గటూర్: పెట్రోలు పోసుకుని యువకుడు ఆందోళన

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసులో తమకు అన్యాయం జరుగుతుందంటూ మండలంలోని కప్పారావుపేట గ్రామానికి చెందిన గాజుల రాజేందర్ సోదరుడు గాజుల రాకేశ్‌ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశాడు. పెట్రోల్ పోసుకుని గంటకు పైగా ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల్లో నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని ధర్మపురి సీఐ రామ నరసింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

News June 13, 2024

వరంగల్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో ఇంటర్ విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువతి వారం రోజుల కిందట పెద్దపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.

News June 13, 2024

కూకట్‌పల్లి: ముగిసిన ఈ-సెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జేఎన్‌టీయూ ప్రవేశాల విభాగంలో జరుగుతున్న మొదటి ఫేజ్ ఈ-సెట్ ధ్రువ పత్రాల పరిశీలన బుధవారంతో ముగిసింది. చివరి రోజు మొత్తం 480 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 450 మంది హాజరయ్యారని ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ రావు తెలిపారు. రెండో ఫేజ్ ధ్రువపత్రాల పరిశీలన వచ్చే నెల 17 నుంచి మొదలవుతుందన్నారు. మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిన సీట్ల భర్తీ రెండో ఫేజ్‌లో జరుగుతుందన్నారు.

News June 13, 2024

అవిశ్వాసం వీగిపోతుంది: డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి

image

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నష్టాల్లో ఉన్న బ్యాంకును తమ పాలకవర్గం, రైతుల సహకారంతో అభివృద్ధి పథంలో నడిపించామని డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని , డైరెక్టర్లు అందరూ తమ వైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. రూ.900 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకుని రూ.2400 కోట్ల టర్నోవర్‌ కు తెచ్చామని తెలిపారు.

News June 13, 2024

కూకట్‌పల్లి: ముగిసిన ఈ-సెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జేఎన్‌టీయూ ప్రవేశాల విభాగంలో జరుగుతున్న మొదటి ఫేజ్ ఈ-సెట్ ధ్రువ పత్రాల పరిశీలన బుధవారంతో ముగిసింది. చివరి రోజు మొత్తం 480 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 450 మంది హాజరయ్యారని ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ రావు తెలిపారు. రెండో ఫేజ్ ధ్రువపత్రాల పరిశీలన వచ్చే నెల 17 నుంచి మొదలవుతుందన్నారు. మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిన సీట్ల భర్తీ రెండో ఫేజ్‌లో జరుగుతుందన్నారు.

News June 13, 2024

MNCL: మంత్రి పదవి ఎవరికో..?

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పరిస్థితిని రేవంత్ సర్కార్ ఆరా తీస్తోంది. ఎంపీ సీటు ఓడిపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీ బలోపేతం, శ్రేణులను ఏకతాటిపై నడిపించాలంటే మంత్రి పదవీ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కోసం MNCL ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, గడ్డం సోదరుల మధ్య పోటీ నెలకొంది. ఇరువర్గాల మధ్య మంత్రి పదవి ఎవరిని వరిస్తోందనేది కీలకంగా మారుతోంది.

News June 13, 2024

కామారెడ్డి: వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

image

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బిక్కనూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మల్లుపల్లితండాకు చెందిన అబ్దుల్లా(32), సయ్యద్ చాంద్(38) గల్ఫ్ వెళ్లడానికి వీసాకోసం వేములవాడలో ఇంటర్వ్యూ కోసం బైక్ పై వెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. జంగంపల్లికి చెందిన పుల్లూరి రాజు(30) తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.