Telangana

News June 13, 2024

MNCL: 12 మంది నకిలీ వైద్యులపై కేసు నమోదు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నకిలీ ఆసుపత్రులపై నేషనల్ మెడికల్ కమిషన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల, నస్పూర్ , శ్రీరాంపూర్, మందమర్రి, సిర్పూర్, నీల్వాయిలో ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న 12 మందిపై కేసు నమోదు చేశారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News June 13, 2024

జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి కృషి: ఎంపీ నగేశ్

image

జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. ఎంపీను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీలు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తన వంతు కృషి చేస్తానని ఎంపీ పేర్కొన్నారు.

News June 13, 2024

KMM: ముగ్గురికి డయేరియా

image

బోనకల్ మండలం రావినూతల, బోనకల్, ఆళ్లపాడు గ్రామాల్లో పలువురు జ్వరం బారిన పడ్డారనే సమాచారంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖాధికారులు బుధవారం వైద్యశిబిరాలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించగా ఆళ్లపాడులో ముగ్గురికి డయేరియా సోకినట్లు తేలింది. దీంతో వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదమున్నందున కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఇంట్లో తయారు చేసిన వేడి ఆహారమే తీసుకోవాలని సూచించారు.

News June 13, 2024

ఉప్పల్: 22న ఫాస్ట్‌ బౌలర్ల కోసం టాలెంట్‌ హంట్‌

image

ఫాస్ట్‌ బౌలర్ల కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ప్రత్యేకంగా టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తోందని కార్యదర్శి దేవ్‌రాజ్‌ తెలిపారు. ఈ నెల 22న ఉప్పల్‌ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టాలెంట్‌ హంట్‌ను నిర్వహించనున్నామని చెప్పారు. ఆసక్తి గల క్రికెటర్లు వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లను హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News June 13, 2024

ఉప్పల్: 22న ఫాస్ట్‌ బౌలర్ల కోసం టాలెంట్‌ హంట్‌

image

ఫాస్ట్‌ బౌలర్ల కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ప్రత్యేకంగా టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తోందని కార్యదర్శి దేవ్‌రాజ్‌ తెలిపారు. ఈ నెల 22న ఉప్పల్‌ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టాలెంట్‌ హంట్‌ను నిర్వహించనున్నామని చెప్పారు. ఆసక్తి గల క్రికెటర్లు వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లను హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News June 13, 2024

నల్గొండ: డబ్బులు జమ కావట్లే!

image

మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ బండ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో రాయితీ డబ్బులు జమ కావడం లేదు. దీంతో ఏజేన్సీలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది DEC 26 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాలో 10.07 లక్షల రేషన్ కార్డులుండగా 10.17 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.

News June 13, 2024

వేల్పూర్: పచ్చలనడ్కుడ 144 సెక్షన్

image

వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడ్కుడలో వీడీసీ సభ్యులకు, ప్రజలకు పోలీస్ శాఖ హెచ్చరిక జారిచేసింది. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వేల్పూర్ ఆదేశాల మేరకు గ్రామంలో ఈనెల 13 నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని SI వినయ్ తెలిపారు. పెద్దవాగు ఇసుక విషయంలో పచ్చలనడ్కుడ, జాన్కంపేట గ్రామాల మద్య వివాదం నెలకొన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని సూచించారు.

News June 13, 2024

గద్వాల: పోలీస్ బెటాలియన్‌లో లంచం తీసుకుంటూ చిక్కారు

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి X రోడ్డ్ బీచుపల్లిలోని 10వ బెటాలియన్‌లో రూ.50వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ కమాండెంట్ నరసింహ స్వామి పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఏఆర్ఎస్సై అబ్దుల్ వహాబ్ సహకారంతో ఓ కానిస్టేబుల్ మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించడానికి రూ.50ల లంచం డిమాండ్ చేసిన కేసులో నరసింహ స్వామిని అరెస్టు చేసినట్ల ఏసీబీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలి: జడ్జి

image

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీలత పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీలత మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కృషి చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.

News June 13, 2024

సిద్దిపేట: ‘పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం’

image

వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పనితీరును సమీక్షించారు. వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధులు, దోమల కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, చికున్ గన్యా, ఫైలేరియా, డెంగీని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.