Telangana

News June 13, 2024

ప్రభుత్వ బడుల్లో సమస్యల పరిష్కారం మాది: మంత్రి రాజనర్సింహ

image

‘ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం టీచర్లుగా మీ బాధ్యత’ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాయికోడ్‌లో బుధవారం నిర్వహించిన ‘బడి బాట’లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులపై ప్రజల ఆలోచన విధానం మార్చుకోవాలని, ఆ బడులు మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని సూచించారు. ప్రైవేటుకు దీటుగా విద్య బోధన కొనసాగేలా చూడాలని కోరారు.

News June 13, 2024

KMR: మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. బిటీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు అంచనాలు రూపొందించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News June 13, 2024

వరంగల్: నేడు ఎనుమాముల మార్కెట్ ఓపెన్

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని వారాలుగా ప్రతి బుధవారం మార్కెట్‌కు అధికారులు సెలవు ప్రకటించారు. తిరిగి నేడు ప్రారంభం కానుంది. రైతులు తేమలేని నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని
అధికారులు సూచిస్తున్నారు.

News June 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బడిబాట. @ తంగళ్ళపల్లి మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట సెస్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. @ కరీంనగర్ లో సినీ నటుడు గోపీచంద్ జన్మదిన వేడుకలు. @ కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న జగిత్యాల ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో బడిబాటలో పాల్గొన్న కలెక్టర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ.

News June 12, 2024

గగ్గుపల్లిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామానికి చెందిన పోషన్న (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోషన్న బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రానికి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూసింది. అక్కడ భర్త మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 12, 2024

జైపూర్ అడవిలో 19 జింకలను వదిలిన అధికారులు

image

జైపూర్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం 19 చుక్కల జింకలను అధికారులు వదిలిపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంత సమీపంలోని పొలాల్లో జింకలు సంచరించడంతో రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని వాటిని పట్టుకొని జైపూర్ అడవిలో వదిలిపెట్టారు.

News June 12, 2024

ఖమ్మం: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి

image

లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన మేడ నాగార్జున (35) బైక్పై వస్తుండగా శ్రీశ్రీ సర్కిల్ సమీపంలోని ఫంక్షన్ హల్ వద్ద వెనుక నుంచి వస్తున్న లారీకు బైక్ హ్యాండిల్ తగులడంతో లారీ వెనుక టైర్ కిందపడి నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 12, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు !

image

✒అచ్చంపేట మున్సిపాలిటీని కోల్పోయిన BRS
✒ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ
✒గద్వాల్:14న ఉద్యోగ మేళా
✒విద్యా,వైద్య రంగానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే పర్ణిక
✒APలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం.. ఉమ్మడి జిల్లాలో ఫ్యాన్స్ సంబరాలు
✒పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి:సిపిఐ
✒ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నామినేటెడ్‌ పదవుల సందడి
✒ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లపై ఫోకస్

News June 12, 2024

ఖమ్మం: ట్రాక్టర్ కిందపడి ఏడేళ్ల బాలుడు దుర్మరణం

image

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. ముత్తగూడెంకి చెందిన నరేష్-గౌతమి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు వీరేందర్ (7)రేషన్ కోసం దుకాణం వద్దకు సైకిల్ పై వెళ్లి వస్తుండగా స్థానిక బ్రిడ్జి వద్ద మట్టి ట్రాక్టర్ అతివేగంగా వచ్చి వీరేందర్‌ను ఢీకొట్టింది. అతని పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 12, 2024

ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం సానుకూలం: టీఎన్జీవో

image

ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దశలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్యోగుల సమస్యలు లేవనెత్తగా పైవిధంగా స్పందించారని తెలిపారు.