Telangana

News June 12, 2024

NZB జిల్లా నుంచి వరంగల్‌కి డీలక్స్ బస్‌లు

image

నిజమాబాద్ జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా డీలక్స్ బస్‌లను అందుబాటులోకి తెచ్చింది. నిజమాబాద్ నుంచి వరంగల్‌కు ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ అధికారులు డీలక్స్ బస్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి డీలక్స్ బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

News June 12, 2024

గణనీయంగా పెరిగిన రామయ్య హుండీ ఆదాయం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో హుండీలను లెక్కించారు. 41 రోజులకుగాను హుండీ ఆదాయం రు.1,68,54,129లు, 117 గ్రాముల బంగారం, 1300 గ్రాముల వెండి లభించింది. ఇవి కాకుండా ఫారిన్ కరెన్సీ యూఎస్ డాలర్స్-557, ఖతర్ రియాల్స్-5, ఇంగ్లాండ్ పౌండ్స్-20, ఫిలిప్పైన్స్ పిసో -20, నేపాల్ రుపీస్ -950, యూఏఈ దిరాన్స్ -20, మలేషియా రింగ్ట్స్ -14, ఆస్ట్రేలియా డాలర్స్-60, కెనడా డాలర్స్-20 లభించాయి.

News June 12, 2024

కొత్తగూడ: అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై కందిరీగల దాడి

image

అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై కందిరీగలు దాడిచేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బుధవారం జరిగింది. ఎంచగూడెం గ్రామానికి చెందిన వీరాస్వామి అనే వ్యక్తి మరణించగా.. దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో టపాసులు పేల్చగా ఆ చప్పుళ్లకు సమీపంలో చెట్టుపై ఉన్న కందిరీగలు లేచి అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై దాడిచేశాయి. దీంతో శవాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.

News June 12, 2024

బాన్సువాడలో వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు

image

వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. మండలంలోని తాడ్కోల్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో బుధవారం ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఉప్పెర సాయవ్వను గొంతుకోసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మెడలోని బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులను ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం వెంట ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్, వైరా ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

News June 12, 2024

NGKL: లింక్ పంపి ఫోన్‌ హ్యాక్‌ చేస్తున్నారు.. జాగ్రత్త

image

నాగర్ కర్నూల్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మేనేజర్‌ ఫోన్‌కి వారం క్రితం మెసేజ్‌‌గా వచ్చిన లింక్ ఓపెన్‌ చేయగా ఫోన్‌ హ్యాక్‌ చేశారు. బాధితుడి ఫోటోను న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి బెదిరించి రూ.1.56 లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆపకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు SI గోవర్దన్‌ తెలిపారు.

News June 12, 2024

విద్యా, వైద్యానికే మొదటి ప్రాధాన్యత: డిప్యూటీ సీఎం

image

ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

News June 12, 2024

జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి సమావేశం

image

హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో వర్షాకాలం నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై చర్చించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

News June 12, 2024

మల్లూరు: మొక్కుబడి కోడెలను అమ్మిన ఆలయ సిబ్బంది

image

మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు మొక్కుగా సమర్పించిన రెండు కోడెలను ఆలయ సిబ్బంది కమలాపురానికి చెందిన ఓ వ్యక్తికి రూ.7,800లకు విక్రయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆలయ ఇన్‌ఛార్జి ఈవో మహేశ్‌ను నిలదీయడంతో తిరిగి కోడెలను దేవస్థానానికి రప్పించారు. ప్రస్తుతం ఈ విషయం చుట్టుపక్కల హాట్‌టాపిక్‌గా మారింది.

News June 12, 2024

ఖమ్మం: కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి

image

కొనిజర్లలో విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. కొనిజర్ల ఆయుర్వేద వైద్యశాలలో కరెంటు మరమ్మతులు చేస్తుండగా విద్యాద్ఘాతంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. మృతుడిని వైరా మండలం గొల్లపూడికి చెందిన సతీశ్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.