Telangana

News June 12, 2024

ఖమ్మం: కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి

image

కొనిజర్లలో విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. కొనిజర్ల ఆయుర్వేద వైద్యశాలలో కరెంటు మరమ్మతులు చేస్తుండగా విద్యాద్ఘాతంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. మృతుడిని వైరా మండలం గొల్లపూడికి చెందిన సతీశ్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 12, 2024

HSBD: వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం

image

జీహెచ్ఎంసీ కార్యాలయంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్ అమ్రపాలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా చేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

News June 12, 2024

మెదక్: వేర్వేరుగా కరెంటు షాక్‌తో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మరణించారు. మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన వి.నగేష్(40) వ్యవసాయ పొలం వద్ద స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరు పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతిచెందాడు.
దీని విద్యుత్ అధికారులే నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు గ్రామంలో ధర్నా చేశారు. అలాగే మెదక్‌లోని గాంధీనగర్‌లో గుట్ట కిందిపల్లికి చెందిన చింతల నర్సింలు మైక్ వైర్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు.

News June 12, 2024

ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా కొట్టి హత్య చేశారు. పాఠశాల పున:ప్రారంభం కావడంతో బుధవారం విధులకు హాజరయ్యేందుకు నార్నూరు మండలంలోని తన స్వగ్రామం నుంచి జైనథ్‌కు బైక్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హతమార్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

KMM: విద్యుత్ బిల్లులు.. ఇక ఈజీ!

image

విద్యుత్ బిల్లుల చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్ ) క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గడిచిన మే నెలలో ఖమ్మం సర్కిల్ పరిధిలో 1,19,678 మంది గృహ విద్యుత్ వినియోగదారులు రూ.24.47 కోట్ల బిల్లులను ఆన్లైన్లో చెల్లించారు. ఇక భద్రాద్రి జిల్లాలో 71,865 గృహ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా రూ.13.97 కోట్లను చెల్లించారు.

News June 12, 2024

కొత్తగూడెం: చుట్టపు చూపుకు వెళ్లి.. పాముకాటుకు బలి

image

పాముకాటుతో ములుగు జిల్లా మంగపేట మండలంలో దండాల రాణి అనే బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలకు చెందిన దండల రాణి అనే బాలిక బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో దేవానగరంలోని పెద్దమ్మ ఇంట్లో పాముకాటుకు గురైంది. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 12, 2024

తీర్యాని: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని యువతి పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన తీర్యాని మండలంలో జరిగింది. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. భింజీగూడ గ్రామపంచాయతీకి చెందిన ఇంద్ర భాయ్ (16)అనే యువతి తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ఆసుపత్రి, అక్కడి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు.

News June 12, 2024

ములుగు: చుట్టపు చూపుగా వచ్చి.. పాముకాటుకు బలి

image

పాముకాటుతో మంగపేట మండలంలో మంగళవారం దండాల రాణి అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలకు చెందిన దండల రాణి చుట్టపు చూపుగా పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో దేవానగరంలోని పెద్దమ్మ ఇంట్లో మంచంపై కూర్చొని కాలు కింద పెట్టిన క్రమంలో పాముకాటుకు గురైంది. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.

News June 12, 2024

MBNR: ‘కాంగ్రెస్‌‌‌లో నామినేటెడ్‌ పదవుల సందడి’

image

MBNR జిల్లా కాంగ్రెస్‌‌లో నామినేటెడ్‌ పదవుల సందడి మొదలైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పార్టీ నేతల్లో అధికార పదవులకు పోటీ నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉన్న నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ పదవులు ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే.

News June 12, 2024

KNR: నేటి నుంచి మోగనున్న బడి గంట

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటపాటలకు గుడ్‌బై చెప్పి బడిబాట పట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా బడులు తెరిచిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.