Telangana

News June 12, 2024

WGL: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

image

రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసుల ప్రకారం.. భద్రాద్రి జిల్లాకు చెందిన సందీప్(25) HYDలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనిపై సొంతూరుకు వచ్చిన అతడు స్నేహితుడితో కలిసి తిగురుపయనమయ్యాడు. MHBD నుంచి SCB షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుండగా.. నెక్కొండ-ఎలుగూరు రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

News June 12, 2024

సంగారెడ్డి: జర్మనీ భాషా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

టాంకాం ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం జర్మనీ భాష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిని వందన తెలిపారు. ఆసక్తి గలవారు www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టాంకాం మొబైల్ యాప్‌లో సైతం దరఖాస్తులు సమర్పించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 12, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,100 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.100, అటు పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కాగా మార్కెట్లో రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా క్రయవిక్రయాలు జరపాలని అధికారులు సూచించారు.

News June 12, 2024

జీహెచ్ఎంసీ పరిధిలో మరో 15 DRF బృందాలు: సీఎస్

image

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 30 DRF బృందాలకు తోడు మరో 15 బృందాలను ఏర్పాటు చేయనున్నట్లుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. వీరి సేవలను ORR వరకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థంగా ఎదుర్కొని పౌరులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకే DRF బృందాలను విస్తరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News June 12, 2024

సిద్దిపేట: బడుల్లో సమస్యల గంట!

image

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాల సంఖ్య 1,018కు చేరాయి. ఇందులో 814 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, ఇతర పనులు చేయిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.34.80 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పటివరకు రూ.8.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.

News June 12, 2024

BREAKING.. సిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. గంబీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డీసీఎంను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగా, మృతులు బిక్కనూరు మండలం మల్లుపల్లె వాసులు షేక్ అబ్దుల్లా, ఎస్ డి చందాగా గుర్తించారు. బైకుపై వేములవాడకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జురిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

నామినేటెడ్‌ పదవులు.. NLG మంత్రులు ఎవరివైపు..?

image

ఎంపీ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆశావహులు తమ నాయకుల ద్వారా పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. KDD, HZNR నియోజకవర్గ నేతలు మంత్రి ఉత్తమ్‌ ద్వారా NLG, NKL, DVK నియోజకవర్గాల నేతలు మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో పదవుల భర్తీపై స్పష్టత రానుంది.

News June 12, 2024

డ్వాక్రా మహిళలకు ₹28,30,000 కుచ్చు టోపీ..!

image

ఎర్రుపాలెం: జమలాపురం యూనియన్ బ్యాంక్లో డ్వాక్రా మహిళలకు ఓ వ్యక్తి కుచ్చు టోపీ పెట్టాడు. సీసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి వెంకటాపురంలో ఉన్న 30గ్రూపులకు చెందిన 300మంది సభ్యుల రూ.28.3లక్షలను డ్రా చేసుకొని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న మహిళలు బ్యాంకు వద్దకు వెళ్లిఆందోళన చేపట్టారు. రెండు దఫాలుగా డబ్బులు చెల్లిస్తానని బ్యాంకు మేనేజర్ సమక్షంలో కన్నయ్య ఒప్పుకోవడంతో ఆందోళనను విరమించారు.

News June 12, 2024

ADB: ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,758 స్కూల్స్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు అన్ని పాఠశాలలు మొత్తం 4,758 ఉన్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 1,432, ఆ తర్వాత కొమురం భీమ్ జిల్లాలో 1,248 ఉన్నాయి. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలో 1,044, నిర్మల్ జిల్లాలో 1,034 స్కూల్స్ ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలో అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 1,034 స్కూల్స్ ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

News June 12, 2024

MBNR: ‘దోస్త్’ రిజిస్ట్రేషన్‌కు కావలసిన సర్టిఫికెట్స్!!

image

✓ దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం పదో తరగతి మెమో. ✓ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. ✓ కులం, ఆదాయం ధ్రువపత్రాలు (01-04-2024 తర్వాత జారీ చేసినవి. )✓ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్. ✓ ఆధార్ కార్డు నంబర్ పాస్ ఫోటో. ✓ విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలి. ✓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ నెంబర్ ‌కు వచ్చిన ఓటీపీ ద్వారా చేయబడుతుంది. SHARE IT..