India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్థానిక ఎన్నికల నిర్వహన పనుల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని గ్రామీణ ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 4,99,572 మంది ఉండగా.. పురుషులు 2,38,217, మహిళలు 2,51,344, ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ జాబితా ప్రకారం మహిళా ఓటర్లే పురుషుల కంటే 3,127 మంది అధికంగా ఉన్నారు. దీంతో జిల్లాలో ఈ ఎన్నికల్లో వారి ఓట్లే ప్రాధాన్యం కానున్నాయి.

MBNR(D) బాలానగర్(M)లో జనరల్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను 1982 సం.లో స్థాపించారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు సుమారు 650 టీచర్లు, 90 PETలుగా పనిచేస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయికి ఇద్దరు, రాష్ట్రస్థాయిలో 45 మంది విద్యార్థులు ఆడారు. క్రీడలకు పుట్టినిల్లుగా.. ఈ గురుకులం పేరు పొందింది. నేడు క్రీడా దినోత్సవా ఇలాంటి పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మహబూబ్ నగర్(D) హన్వాడ(M) చిన్నదర్ పల్లి చెరువు, మహబూబ్‌నగర్ రూరల్ పరిధిలోని పాలకొండ చెరువు, మయూరి పార్క్ ముందు గల గంగుసాయి చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డి.జానకి పరిశీలించారు. విగ్రహాల తరలింపు మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, చెరువుల వద్ద లైటింగ్, బారికేడింగ్, రెస్క్యూ బృందాల ఏర్పాట్లపై సమీక్షించారు. DSP వెంకటేశ్వర్లు, హన్వాడ SI వెంకటేశ్, రూరల్ SI విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. సిరికొండ మండలం తూంపల్లిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.

బత్తాయి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం నేడు, రేపు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి, గుంటిపల్లి గ్రామాల్లో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డితో పాటు పలువురు సభ్యులు గ్రామాల్లోని బత్తాయి, పామాయిల్ ఆయా తోటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

వరంగల్ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల వారిగా జీపీ కార్యాలయాల ఎదుట కార్యదర్శులు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాపై పూర్తిగా వివరించారు. ఈనెల 30లోపు వివిధ పార్టీల నాయకులు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని సూచించారు.

జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్షిప్‌కు గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలమణి తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన మహిళల జట్టులో జి.శృతి, పురుషుల జట్టులో కే.సాయికుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 29 నుంచి మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే 38వ సీనియర్ నేషనల్ బేస్ బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.

క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ క్రీడా పోటీలను రద్దు చేస్తున్నట్లు DYSO (FAC) పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 31 వరకు వెల్లడించిన షెడ్యూల్డ్‌లో భాగంగా 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన హాకీ, బాస్కెట్ బాల్ టోర్నమెంటును వర్షం కారణంగా రద్దు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణకు మైదానం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఓటరు ఐడి నుంచి ఓట్లను వేరే గ్రామానికి మార్చిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. అడేగామబికి చెందిన మాజీ సర్పంచి వనిత, భర్త సుభాశ్ ఓట్లను కొందరు రెవెన్యూ అధికారి సహాయంతో వేరే గ్రామానికి మార్చారన్నారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులు విశాల్, అచ్యుత్, ధనరాజ్, రెవెన్యూ ఆర్ఐ హుస్సేన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.