Telangana

News June 12, 2024

సౌదీలో అనారోగ్యంతో రామారెడ్డి వాసి మృతి

image

సౌదీలో రామారెడ్డి వాసి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యునుస్(45) బతుకుదెరువు నిమిత్తం 10 రోజుల క్రితం సౌదీకి వెళ్లారు. అక్కడ మూడు రోజులు పని చేశాడని అనారోగ్యంతో మంచం పట్టి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి ప్రభుత్వం తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

News June 12, 2024

KNR: పంట బీమాకు ప్రభుత్వం సిద్ధం!

image

అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని, వారిని గట్టెక్కించేందుకు బీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా వ్యవసాయాధికారి బి.శ్రీనివాసం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఉచిత పంట బీమా పథకం అమలుకు సిద్ధమయిందన్నారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2.03లక్షల మంది రైతులుండగా.. 3.45లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణమవుతుందన్నారు.

News June 12, 2024

వరంగల్‌లో పెరగనున్న భూముల రిజస్ట్రేషన్ ఛార్జీలు

image

ఉమ్మడి WGL వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి రూ.320 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పెంచితే ఏడాదికి రూ.500 కోట్లకు పైగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్‌నగర్ కాలనీలో బయటి మార్కెట్ ప్రకారం గజానికి రూ.40నుంచి రూ.50వేల వరకు పలుకుతోంది. మార్కెట్ విలువ రూ.9వేలు ఉంది. ఇలాంటి చోట్ల 40-50శాతం ఛార్జీలు పెంచే అవకాశముంది.

News June 12, 2024

సిద్దిపేటలో విషాదం.. బాలుడి మృతి

image

సిద్దిపేట పట్టణంలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి చెందాడు. లింగారెడ్డిపల్లికి చెందిన జాన్ బాబు-సంగీతల కుమారుడు గిరీశ్ (17) బాసరలోని త్రిబుల్ ఐటీ‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సెలవుల్లో భాగంగా ఇంటికి వచ్చిన అతను సిమ్మింగ్ పూల్‌‌లో ఈతకు వెళ్లాడు. లోతుగా ఉన్న పూల్‌లో దూకడంతో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్ట నిమిత్తం తరలించారు.

News June 12, 2024

MBNR: చెరువులకు పొంచి ఉన్న ముప్పు

image

ఉమ్మడి జిల్లాలో 6,491 చెరువులు ఉన్నాయి. ఆయకట్టు కలిగిన చెరువులు 672, 100ఎకరాలకు లోబడి ఆయకట్టు కలిగిన చెరువులు, కుంటలు 5,819ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే చాలా చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదముంది. మరమ్మతులు చేపట్టకపోవటమే దీనికి కారణం. గతేడాది వర్షాలకు కట్టలు కుంగి దెబ్బతిన్నాయి. తూముల్లో మట్టి, మొక్కలు మొలిచాయి. చెరువులను ఇటు నీటి పారుదల శాఖ, అటు రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ఆరేళ్లుగా పూర్తిగా కొరవడింది.

News June 12, 2024

Good News: HYDలో కొత్త‌రేషన్ కార్డులు!

image

హైదరాబాద్‌‌లో‌ని వలసదారులకు గుడ్‌న్యూస్. మైగ్రేషన్ రేషన్‌కార్డుల వడపోత ప్రక్రియ‌ మొదలైంది. 2014 తర్వాత కొత్తగా కార్డులు జారీ చేయకపోవడంతో‌ ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది.‌ 2020‌లో అప్లై చేసినా.. అర్హుల ఎంపిక పూర్తి కాలేదు. తాజాగా సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో అర్హుల ఎంపిక‌ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. SHARE IT

News June 12, 2024

Good News: HYDలో కొత్త‌రేషన్ కార్డులు!

image

హైదరాబాద్‌‌లో‌ని వలసదారులకు గుడ్‌న్యూస్. మైగ్రేషన్ రేషన్‌కార్డుల వడపోత ప్రక్రియ‌ మొదలైంది. 2014 తర్వాత కొత్తగా కార్డులు జారీ చేయకపోవడంతో‌ ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది.‌ 2020‌లో అప్లై చేసినా.. అర్హుల ఎంపిక పూర్తి కాలేదు. తాజాగా సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో అర్హుల ఎంపిక‌ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.
SHARE IT

News June 12, 2024

పాఠశాలలకు చేరిన పుస్తకాలు

image

నేటి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు 6,84,740 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఈ మొత్తాన్ని ఇప్పటికే సంబంధిత పాఠశాలలకు సరఫరా చేశారు. 3,94,314 రాతపుస్తకాలను సైతం అందుబాటులో ఉంచారు. ఈసారి నూరు శాతం పుస్తకాలు పాఠశాలలకు చేరటం విశేషం.

News June 12, 2024

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

image

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో అధికారలు ప్రవేటు పాఠశాలలకు హెచ్చరికలు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా ఫీజులను పెంచిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో బిక్షపతి తెలిపారు. అవసరమయితే గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.

News June 12, 2024

ధరూరు: సైబర్ నేరగాళ్ల మోసం.. నగదు మాయం

image

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన ధరూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి ఏఎస్ఐ మాట్లాడుతున్నానని తనకు డబ్బు కావాలని ఈనెల 4న పెట్రోల్ బంకు యజమానికి ఫోన్ చేశాడు. తాను అందుబాటులో లేనని మేనేజర్ గోపి నెంబర్ ఇచ్చాడు. గోపి ఆ వ్యక్తికి రూ.80 వేలు బదిలీ చేశాడు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు.