Telangana

News June 12, 2024

MBNR: ‘పిల్లల స్కూల్ బస్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా.?’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 992 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. అందులో 410 బస్సులే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. MBNR జిల్లాలో 280, వనపర్తిలో 61, నారాయణపేటలో 32, గద్వాలలో 37 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా 582 బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్త మరీ.. మీ పిల్లల బస్సు‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా..? బస్ డ్రైవర్‌ను అడగండి.!

News June 12, 2024

సంగారెడ్డి: పొలంలో మొసలి.. భయం.. భయం..!

image

ఝరాసంగం మం. గుంతమర్పల్లి గ్రామానికి చెందిన భార్గవ రెడ్డి పొలంలో నిన్న సాయంత్రం మొసలిని గుర్తించారు. వ్యవసాయ పనులు చేసేందుకు చెత్త కుప్పలు, కర్రలు తొలగిస్తుండగా మొసలి కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులకు సమాచారం ఇవ్వగా.. తహశీల్దార్ సంజీవరావు, SI రాజేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చీకటి కావడంతో గుర్తించలేదు. మొసలి సంచారం విన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

News June 12, 2024

హైదరాబాద్‌‌లో మ్యాన్‌హోళ్లను తెరిస్తే జైలుకే!

image

హైదరాబాద్‌లో ఇటీవల GHMC అధికారులు లోతైన మ్యాన్‌హోళ్లపై ఎరుపు రంగు పూశారు. భారీ వర్షం, వరదలు వచ్చినప్పుడు‌ మ్యాన్‌హోళ్లను తెరవద్దని హెచ్చరించారు. గతంలో‌ నాలాలో‌ పడి పలువురు‌ మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాల నివారణ కోసం అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అక్రమంగా మ్యాన్‌హోల్స్‌ తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది. వరదల్లో వీటిని తెరవకండి. ఇతరులకు హాని కలిగించకండి. SHARE IT

News June 12, 2024

హైదరాబాద్‌‌లో మ్యాన్‌హోళ్లను తెరిస్తే జైలుకే!

image

హైదరాబాద్‌లో ఇటీవల GHMC అధికారులు లోతైన మ్యాన్‌హోళ్లపై ఎరుపు రంగు పూశారు. భారీ వర్షం, వరదలు వచ్చినప్పుడు‌ మ్యాన్‌హోళ్లను తెరవద్దని హెచ్చరించారు. గతంలో‌ నాలాలో‌ పడి పలువురు‌ మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాల నివారణ కోసం అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అక్రమంగా మ్యాన్‌హోల్స్‌ తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది. వరదల్లో వీటిని తెరవకండి. ఇతరులకు హాని కలిగించకండి.
SHARE IT

News June 12, 2024

డోర్నకల్‌లో ‘MLA గారి తాలూకా’ ట్రెండ్

image

ఏపీలోని పిఠాపురం సంస్కృతి తెలంగాణకు చేరింది. ఇటీవల KNR జిల్లా చొప్పదండి, WGL పాలకుర్తి MLAల అభిమానులు వాహనాల మీద ‘ఎమ్మెల్యేల గారి తాలూకా’ అనే స్టిక్కర్లు అతికించి సందడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరిస్తూ డోర్నకల్‌లో సైతం వాహనాల మీద ఈ తరహా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. మంగళవారం డోర్నకల్ మండలంలో ఓ వాహనంపై ‘డోర్నకల్ MLA గారి తాలూకా’ అని రాసి ఉన్న స్టిక్కరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

News June 12, 2024

ADB: నేటి నుంచి పాఠశాలు ప్రారంభం

image

ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.

News June 12, 2024

KNR: నేటి నుంచి పాఠశాలు ప్రారంభం

image

ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.

News June 12, 2024

వనపర్తి: జిల్లాలో విత్తనాల కొరత లేదు: మంత్రి జూపల్లి

image

వనపర్తి జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువులు, విత్తనాల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు రైతులు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News June 12, 2024

అందోల్: “ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం”

image

ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించే విషయంలో హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. హోటల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

News June 12, 2024

NZB: నేటి నుంచి పాఠశాలు ప్రారంభం

image

ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.