Telangana

News June 12, 2024

ఈనెల 17 వరకు ఎంట్రన్స్ ఫీజు చెల్లించాలి: డాక్టర్ వై.ప్రశాంతి

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్లగొండలో ఇంటర్ విద్యతో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ కోర్సులో చేరేందుకు ఎంట్రెన్స్ పరీక్ష ఫీజును ఈనెల 17 వరకు చెల్లించాలని ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజియూ ప్లేస్మెంట్ డైరెక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు. 

News June 12, 2024

సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తహసిల్దార్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధరణి దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 12, 2024

వరంగల్ జిల్లా పాలనలో మహిళల మార్క్..

image

ఉమ్మడి వరంగల్ జిల్లా పాలనలో మహిళల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోనూ వరంగల్ ప్రాంతాన్ని రాణిరుద్రమదేవి పరిపాలించింది. రాణిరుద్రమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునట్లుగా జిల్లాలో 80శాతం ప్రజాప్రతినిధులు, అధికార సారథులు మహిళలే కావడం విశేషం. జిల్లా నుండి ఇద్దరు మహిళా మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఐదుగురు జడ్పీ చైర్మన్లు, మేయర్, మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మహిళలే ఉన్నారు.

News June 12, 2024

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చేరండి: కలెక్టర్ గౌతమ్

image

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బడి బాట, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపూర్తిపై విద్యాశాఖ, ఇంజనీరింగ్, మండలసమాఖ్యలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News June 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మిషన్ భగీరథ సర్వే పనులను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్. @ సైదాపూర్ మండలంలో 10 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ మల్లాపూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి. @ రాయికల్ మండలంలో అగ్ని ప్రమాదంలో వ్యక్తి మృతి. @ ధర్మపురిలో వైభవంగా సుదర్శన యాగం. @ మెట్ పల్లి పట్టణంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల జాతర. @ భక్తులతో కిటకిటలాడిన వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయం.

News June 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలారా.. వానాకాలం.. జరభద్రం

image

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కొబ్బరి చిప్పలు, ఖాళీ బొండాలు, కోడి గుడ్డు పెంకులు, మొక్కల తొట్టిలు, వృథాగా ఉన్న టైర్లు, వేసవిలో వాడిన కూలర్లలో నీళ్లు ఉంటే దోమలు తయారై డెంగీ ప్రబలే అవకాశం ఉంది. మురుగు, నిల్వ నీరు మలేరియా, ఫైలేరియా ప్రబలేందుకు దోహదం చేస్తాయి. వానాకాలంలో పరిస్థితి మరింత తీవ్రత చాటే అవకాశం ఉన్న దృష్ట్యా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

News June 11, 2024

తొగుట: పిడుగు పాటుకు రైతు మృతి

image

తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కడారి శ్రీశైలం అనే రైతు వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో పిడుగు పడి స్పృహ కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉండగా వైద్య చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తీసుకెళ్తున్న క్రమంలో శ్రీశైలం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

News June 11, 2024

పిట్లం: భార్యను ఉరేసి చంపిన భర్త

image

కుటుంబ కలహాల కారణంగా భర్యను చంపేశాడో భర్త. పిట్లం మండలంలోని గద్ద గుండు తండాకు చెందిన బూలి బాయి, అంబ్రియ నాయక్ భార్యాభర్తలు. అయితే బూలి బాయికి కొన్నేళ్లుగా ఆరోగ్యం బాగా లేక భర్త పట్టించుకోలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో అంబ్రియ నాయక్ మంగళవారం భార్యను ఉరేసి చంపేశాడు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✒గద్వాల్: విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
✒NGKL:వట్టెం వెంకటేశ్వర స్వామి సేవలో త్రిపుర గవర్నర్
✒బడి బాటపై ప్రత్యేక నిఘా.. నివేదిక పంపండి:DEOలు
✒NRPT:నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని ధర్నా
✒వనపర్తి:విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి జూపల్లి వార్నింగ్
✒ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షం
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న భగీరథ నల్లల సర్వే
✒ఆయా మండలాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు

News June 11, 2024

ASF: కుక్కల బారి నుంచి జింకను రక్షించిన యువకుడు

image

కుక్కల దాడి నుంచి జింకను ఓ యువకుడు కాపాడి అటవీ అధికారులకు అప్పగించాడు. ఆసిఫాబాద్‌లోని మాణిక్ గూడలో శివారులో ఓ మచ్చల జింకను కుక్కలు చుట్టు ముట్టి దాడికి యత్నించాయి. తప్పించుకునే ప్రయత్నంలో అది ఫయాజ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చింది. అక్కడ ఉన్న ఫయాజ్ కుమారుడు రహ్మన్ కుక్కలను తరిమి కొట్టి జింకను కాపాడాడు. అనంతరం దానిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో యువకుడిని అధికారులు అభినందించారు.