Telangana

News June 11, 2024

ఖమ్మం: ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

image

ఉరివేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఎర్రుపాలెం మండలంలో చోటుచేసుకుంది. ములుగుమాడు గ్రామానికి చెందిన ఓ యువతీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరివేసుకుని ఉన్న యువతిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా యువతి ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News June 11, 2024

NZB: CP కార్యాలయంలో మహిళా ఆత్మహత్యాయత్నం

image

నిజామాబాద్ CP ఆఫీస్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్‌కు చెందిన నర్సమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నర్సమ్మకు చెందిన 20 గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె కూతురు గంగాలక్ష్మి తెలిపింది.

News June 11, 2024

MBNR: కృష్ణానదికి వరద.. ఆనందంలో ఉమ్మడి జిల్లా రైతులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న కృష్ణానదికి వరద జలాలు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి నీరు చేరడంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వరుసగా పడుతున్న వానలకు కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతోంది. దీనితో ఈ ఏడాది నదికి ఆశించిన మేర వరద జలాలు చేరుతాయని ఆశిస్తున్నారు.

News June 11, 2024

KNR: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి

image

కరీంనగర్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు పక్రియ ముగిసింది. జిల్లా యంత్రాంగం 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇందులో ఐకేపీ 51 కేంద్రాల ద్వారా 45,125 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ఫ్యాక్స్ 223 కేంద్రాల ద్వారా 1,87,031.68 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, DCMS ఆధ్వర్యంలో 43 కేంద్రాల ద్వారా 32,838.16 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, హాకా ఆధ్వర్యంలో 4 కేంద్రాల ద్వారా 2995.36 ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

News June 11, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 34.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 32.5 మి.మీ, గద్వాల జిల్లా తోతినొనిద్దోడి 32.1 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట 32.1 మి.మీ, వనపర్తి జిల్లా మదనపూర్ 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 11, 2024

సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ మల్లన్న

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎంను కలిసి పూలబొకే అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

News June 11, 2024

NZB: భార్యతో గొడవ.. మనస్తాపానికి గురై వ్యక్తి సూసైడ్

image

భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. వినాయక్ నగర్‌కు చెందిన మహమ్మద్ అన్వర్‌కు భార్యతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అన్వర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు.

News June 11, 2024

బ్యాంక్ మేనేజర్‌కే స్కెచ్.. డీపీని న్యూడ్‌ ఫొటోగా చేసి బ్లాక్‌మెయిల్

image

ఓ బ్యాంక్ మేనేజర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఘటన నాగర్‌కర్నూల్‌లో జరిగింది. సదరు మేనేజర్‌ ఫోన్‌కు వారం కింద ఓ లింక్ రాగా.. దానిపై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ అయింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీని న్యూడ్ ఫొటోగా మార్చి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టారు. భయపడిన ఆయన ముందుగా రూ.1.56 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసేశాడు. అయినా వేధింపులు ఆగలేదు. దాదాపు 300 మందికి న్యూడ్ ఫొటో పంపినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.

News June 11, 2024

ఖమ్మం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిగురిస్తున్న ఆశలు

image

కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డుల కోసం 35వేలు, కార్డుల్లో మార్పునకు 25,901 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 4,11,347 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 11,32,871గా ఉంది.

News June 11, 2024

మంచిర్యాల: ఐటీఐలో అడ్మిషన్ గడువు పొడిగింపు

image

మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐలో మొదటి దఫా అడ్మిషన్ 2024 ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్స్ లలో శిక్షణను పొందడానికి మొదటి దఫా సీట్ల కొరకు జూన్ 14వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.https://iti.telanhana.gov.in వెబ్ సైటులో నిజ ధ్రువపత్రాల ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.