Telangana

News June 11, 2024

HYDలో ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష

image

HYD తార్నాకలోని ICMRకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది. జూన్ 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://www.nin.res.in/employement.html వెబ్‌సైట్ చూడండి. SHARE IT

News June 11, 2024

HYDలో ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష

image

HYD తార్నాకలోని ICMRకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది. జూన్ 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://www.nin.res.in/employement.html వెబ్‌సైట్ చూడండి. SHARE IT

News June 11, 2024

NZB: ‘భూమి కోసమే వెంగళ్ హత్య’

image

డిచ్పల్లిలోని సీఎంసీ ప్రాంతంలో జరిగిన వెంగల్ హత్య కేసులో నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. వెంగల్‌కు చెందిన భూమి అతని బంధువు బిజ్జు పేరుపై ధరణిలో ఉండగా కొత్త పట్టాదాసు పాస్ పుస్తకం వచ్చింది. భూమికి సంబంధించి రుణమాఫీ, రైతు బంధు డబ్బులు బిజ్జు తీసుకుంటోంది. తన భూమిని తన పేరుపై మర్చాలని వెంగల్ అడగటంతో బిజ్జు, ఆమె కొడుకు ప్లాన్ ప్రకారం మద్యం తాగించి వెంగళ్ ను హత్య చేశారు.

News June 11, 2024

HNK: చింతచెట్టు కోసం గొడవ.. ప్రాణాలు కోల్పోయిన తల్లి

image

చింతచెట్టు కోసం జరిగిన గొడవ కొడుకు చేతిలో తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. HNK జిల్లా శాయంపేట మం. కొప్పులకు చెందిన తిరుపతి రెడ్డికి, జయపాల్ రెడ్డికి ఈనెల 8న చింతచెట్టు విషయంలో గొడవ జరిగింది. గొడవ వద్దని తిరుపతిరెడ్డిని భార్య అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కోపంలో భార్యను కొట్టేందుకు తిరుపతిరెడ్డి ప్రయత్నించగా.. తల్లి నర్సమ్మ అడ్డుకుంది. దీంతో తీవ్ర గాయాలపాలై MGMకు తీసుకెళ్లే క్రమంలో మరణించింది.

News June 11, 2024

కొడంగల్: గుండెపోటుతో మాజీ జెడ్పీటీసీ మృతి

image

కొడంగల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి అరకు యాత్రకు వెళ్లిన ఆయనకు రాత్రి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలాడు. మోహన్ రెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామం దౌల్తాబాద్‌కు కుటుంబ సభ్యులు తీసుకువస్తున్నారు. బుధవారం అంతక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 11, 2024

KNR: మూగ యువతిపై యాభై ఏళ్ల వ్యక్తి అత్యాచారం?

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన యాభై ఏళ్ల వ్యక్తి సోమవారం అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, సదరు యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 11, 2024

KTDM: క్యాన్సర్‌తో 15 నెలల చిన్నారి మృతి

image

గార్లలో విషాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ బజార్‌కు చెందిన 15 నెలల చిన్నారి షబానా క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. పుట్టిన కొద్దిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాప మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News June 11, 2024

త్వరలో వనదేవతల స్మృతి వనం?

image

మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క-సారలమ్మల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా గద్దెల వెనకవైపు ఉన్న 25 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. జాతర విశేషాలతో పాటు.. అప్పటి వస్తువులు, వారి గొప్పతనం తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్ట సుందరీకరణతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.

News June 11, 2024

HYD: ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి: హర్షవర్ధన్

image

రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల విషయమై PRTU తెలంగాణ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీదేవసేనని పలువురు కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు జరిపి న్యాయం చేయాలని కోరారు. దేవసేన స్పందిస్తూ రేపు స్వయంగా తానే అడక్వేట్ జనరల్‌ని కలిసి సాధ్యాసాధ్యాలపై చర్చించి వారికి సాధ్యమైనంత మేరకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

News June 11, 2024

అమెరికాలో విజయోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని అట్లాంటా నగరంలో పర్యటించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అట్లాంటా నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సంస్థ నిర్వహించిన (NDA) విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి మరోసారి BJP పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.