Telangana

News June 11, 2024

HYD: ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి: హర్షవర్ధన్

image

రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల విషయమై PRTU తెలంగాణ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీదేవసేనని పలువురు కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు జరిపి న్యాయం చేయాలని కోరారు. దేవసేన స్పందిస్తూ రేపు స్వయంగా తానే అడక్వేట్ జనరల్‌ని కలిసి సాధ్యాసాధ్యాలపై చర్చించి వారికి సాధ్యమైనంత మేరకు న్యాయం జరిగేలా చూస్తా అని హామీ ఇచ్చారు.

News June 11, 2024

HYD: పోకిరీలపై మఫ్టీలో షీ టీమ్స్ నిఘా..!

image

HYD, రాచకొండ, సైబరాబద్ కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్ నిఘా పెంచాయి. బస్టాప్‌లు, పార్కులు, కాలేజీలు, స్కూళ్లు ఇతర ప్రాంతాల్లో యువతుల వెంట పడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలను పోలీసులు మఫ్టీలో ఉంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ముందుగా వారు చేస్తున్న ఆకతాయి చేష్టలను పోలీసులు వీడియో తీసి ఆ తర్వాత పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. యువతులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.

News June 11, 2024

HYD: పోకిరీలపై మఫ్టీలో షీ టీమ్స్ నిఘా..!

image

HYD, రాచకొండ, సైబరాబద్ కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్ నిఘా పెంచాయి. బస్టాప్‌లు, పార్కులు, కాలేజీలు, స్కూళ్లు ఇతర ప్రాంతాల్లో యువతుల వెంట పడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలను పోలీసులు మఫ్టీలో ఉంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ముందుగా వారు చేస్తున్న ఆకతాయి చేష్టలను పోలీసులు వీడియో తీసి ఆ తర్వాత పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. యువతులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.

News June 11, 2024

ఖమ్మం: వాంతులు, విరోచనాలతో రెండేళ్ల బాలుడి మృతి

image

వాంతులు, విరోచనాలతో రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బోనకల్‌లో చోటు చేసుకుంది. బోనకల్ ఎస్టీ కాలనీకి చెందిన జమలయ్య, లావణ్య దంపతుల కుమారుడు భరత్(2)కు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు గ్రామంలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.

News June 11, 2024

త్వరలో వనదేవతల స్మృతి వనం?

image

మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క-సారలమ్మల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా గద్దెల వెనకవైపు ఉన్న 25 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. జాతర విశేషాలతో పాటు.. అప్పటి వస్తువులు, వారి గొప్పతనం తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్ట సుందరీకరణతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.

News June 11, 2024

HYD: బక్రీద్ పండుగ.. వ్యర్థాలను రోడ్లపై వేయకండి..!

image

బక్రీద్ పర్వదినాన వెలువడే వ్యర్థాలను రోడ్లపై వేయకూడదని GHMC అధికారులు సూచించారు. ఈ మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మెయింటైనింగ్ కన్వీనర్ మహమ్మద్ అలీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుస్తూనే , పండగలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకోవాలని కోరారు. ఉప్పల్, నాంపల్లి, మలక్‌పేట్, నాచారం ప్రాంతాల్లో ప్రత్యేక NGOS స్వచ్ఛతకు కృషి చేస్తున్నాయన్నారు.

News June 11, 2024

HYD: బక్రీద్ పండుగ.. వ్యర్థాలను రోడ్లపై వేయకండి..!

image

బక్రీద్ పర్వదినాన వెలువడి వ్యర్థాలను రోడ్లపై వేయకూడదని GHMC అధికారులు సూచించారు. ఈ మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మెయింటైనింగ్ కన్వీనర్ మహమ్మద్ అలీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుస్తూనే , పండగలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకోవాలని కోరారు. ఉప్పల్, నాంపల్లి, మలక్‌పేట్, నాచారం ప్రాంతాల్లో ప్రత్యేక NGOS స్వచ్ఛతకు కృషి చేస్తున్నాయన్నారు.

News June 11, 2024

వరంగల్: నిన్నటితో పోలిస్తే రూ.25 తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న క్వింటా పత్తి రూ.7,025 ధర పలకగా నేడు రూ.25 తగ్గి రూ.7వేలకి పడిపోయింది. పత్తి ధర మళ్లీ తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు. 

News June 11, 2024

MHBD: క్యాన్సర్‌తో 15 నెలల చిన్నారి మృతి

image

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గార్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ బజార్‌కి చెందిన 15 నెలల చిన్నారి షబానా క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. పుట్టిన కొద్దిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News June 11, 2024

MBNR: ప్రారంభమైన మిషన్ భగీరథ ఇంటింటి సర్వే

image

జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల్లో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే సోమవారం ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో 441 గ్రామ పంచాయతీలు, 661 ఆవాస గ్రామాలు ఉన్నాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మిషన్ భగీరథపై దృష్టిసారించారు.