Telangana

News June 11, 2024

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష

image

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయి తండ్రికి 25 ఏళ్లు జైలుశిక్షను విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్ సెషన్స్ మహిళా జడ్జి శ్యామ్‌శ్రీ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. గతేడాది ఫిబ్రవరి 23న మద్యం మత్తులో సంపత్ కుమార్ తన కూతురిపై అత్యాచారం చేశాడు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా తీర్పు వెలువడింది.   

News June 11, 2024

రంగారెడ్డి: బడి బస్సులపై నజర్

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 11,922 బడి బస్సులు ఉండగా… ఇప్పటివరకు 8,917 బస్సులు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందాయి. మరో 3,005 బస్సులకు సామర్ధ్య నిర్ధారణ కాలేదని DTC చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. 15 ఏళ్ల సర్వీస్ దాటిన బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగరాదని స్పష్టం చేశారు. ఇలాంటి బస్సుల్లో పిల్లలను తీసుకెళ్తే వెంటనే సీజ్ చేసి యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేయూ పరిధిలో జులై 1 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి తెలిపారు. మొదటి పేపర్ జూలై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

News June 11, 2024

సెల్ఫీ తీసుకుంటూ హైదరాబాద్ యువకుడి మృతి

image

విహార యాత్రకు వెళ్లిన యువకుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా తరికెరె తాలూకా హెబ్బె జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి నీటిలో పడి శ్రవణ్ (25) అనే యువకుడు సోమవారం మరణించాడు. అతడు HYD వాసిగా పోలీసులు గుర్తించారు. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి వెళ్లగా వాటర్ ఫాల్స్‌లోకి జారి పడినప్పుడు తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించేలోగా మరణించాడు.

NZB: ఆల్ ఇండియా రైఫిల్ రైఫిల్ షూటింగ్‌కు రేఖరాణి 

image

ఆల్ ఇండియా రైఫిల్ రైఫిల్ షూటింగ్ పోటీలకు నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళ కానిస్టేబుల్ రేఖారాణి (డబ్ల్యూ పీసీ 325) ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ల్లో రేఖారాణి రాణించారు. ఈనెల 15 నుం చి తమిళనాడులోని ఒతీవాకం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున రేఖారాణి పాల్గొననున్నారు.

News June 11, 2024

కేయూ పరిధిలో జులై 1 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహచారి తెలిపారు. మొదటి పేపర్ జులై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

News June 11, 2024

ఖమ్మం: ఈ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

image

ఇంజనీరింగ్ థ్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన ఈ సెట్ కౌన్సెలింగ్ ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించనుండగా, 14వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 18న మొదటి విడత సీట్ల కేటాయింపు, 21వ తేదీన సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్న 249మంది విద్యార్థుల్లో 235 మంది హాజరయ్యారు.

News June 11, 2024

ఓరుగల్లుకు ఏం కావాలి?

image

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర కేబినేట్‌లో చోటుదక్కిన విషయం తెలిసిందే. దీంతో తమజిల్లాకు ఇవి వచ్చేలా చూడాలంటూ జిల్లా వాసులు కోరుతున్నారు.
*మామునూరు ఎయిర్‌పోర్టు
*బయ్యారం, కొత్తగూడ, గంగారం ప్రాంతాల్లోని బొగ్గు నిక్షేపాల భూగర్భ గనుల ఏర్పాటు
*ఇనుము, గ్రానైట్, బెరైటీస్, డోలమైట్, లాటరైట్ నిక్షేపాల పరిశ్రమల ఏర్పాటు
*వెయ్యి స్తంభాల గుడికి యునెస్కో గుర్తింపు
*ఇల్లెందులో నూతన ఉపరితల గని ఏర్పాటు