Telangana

News June 11, 2024

KNR: మూడు రోజుల్లో ముగ్గురి మృతి

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వరుస మరణాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం ఎల్లంపల్లిలో శంకరయ్య(75), శనివారం గుజ్జులపల్లిలో కందుగుల గ్రామానికి చెందిన దినసరి కూలీ శనిగరం మొగిలి(45), ఆదివారం ఘన్పూర్ తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి బానోతు ఆంజనేయులు(18) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి మృతి చెందారు.

News June 11, 2024

భూవివాదం.. 3 రోజులుగా మార్చురీలోనే మృతదేహం

image

చౌటుప్పల్ మం. పంతంగిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలిలా.. హన్మంతరెడ్డి HYDలో ఉంటున్నారు. అతడికి సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరికి 7.24 ఎకరాల భూమి ఉంది. వివాదం పరిష్కరించుకోవడానికి హన్మంతరెడ్డి గ్రామానికి వచ్చాడు. ఎటూ తేలకపోవడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. వివాదం పరిష్కారమయ్యాకే అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి బంధువులు డిసైడ్ అవడంతో మూడు రోజులుగా మృతదేహం మార్చురీలోనే ఉంది.

News June 11, 2024

ములుగు: బంగారం కోసం మహిళపై సుత్తెతో దాడి

image

ములుగు మండలం వంటిమామిడిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉంటున్న మహిళపై బంగారం కోసం గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం దాడి చేశారు. మహిళ బయటకు వచ్చిన క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సుత్తెతో దాడి చేసి మహిళ మెడలో నుంచి బంగారాన్ని అపహరించుకుపోయారు. మహిళకు తీవ్ర రక్తస్రావం అవడంతో ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.

News June 11, 2024

బడిబాట నిర్వహణకు రూ.29.75 లక్షల నిధులు విడుదల

image

ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు బడి ఈడు పిల్లలందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బడి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2,975 పాఠశాలలకు రూ.29.75 లక్షల నిధులు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బడి బాట ఈ నెల 19 వరకు కొనసాగనుంది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

News June 11, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

image

HYD అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కోడ్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులు షురూ అయ్యాయి. GHMC పరిధిలోని సుమారు వందకు పైగా కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. వీటితో పాటు పారిశుద్ధ్యం, బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్, సీఆర్ఎంపీ, ఎస్సాఆర్‌డీపీ, ఎస్ఎన్‌డీపీ పనులపై దృష్టి సారించారు.

News June 11, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

image

HYD అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కోడ్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులు షురూ అయ్యాయి. GHMC పరిధిలోని సుమారు వందకు పైగా కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. వీటితో పాటు పారిశుద్ధ్యం, బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్, సీఆర్ఎంపీ, ఎస్సాఆర్‌డీపీ, ఎస్ఎన్‌డీపీ పనులపై దృష్టి సారించారు.

News June 11, 2024

MNCL: రామాలయంలో చోరీ.. బంగారం అపహరణ

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల రామాలయంలో చోరీ జరిగినట్లు పట్టణ సీఐ బన్సీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం మెడలో ఉన్న బంగారు పుస్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆలయం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

News June 11, 2024

కామారెడ్డి: JEE ఫలితాల్లో నవోదయ విద్యార్థుల ప్రభంజనం

image

నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలలో ఆల్ ఓవర్ ఇండియాలోనే బి. శ్రీకాంత్ (265)వ ర్యాంక్, బి. జగన్ (953)వ ర్యాంక్ సాధించినట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. దీంతో విద్యార్థులను ప్రిన్సిపల్ సత్యవతి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు ప్రత్యేక విద్య బోధన అందించిన ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ అభినందించారు.

News June 11, 2024

WGL: రోటవేటర్‌లో పడి బాలుడి మృతి (UPDATE)

image

ట్రాక్టర్ రోటవేటర్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన WGL జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. లైన్ తండాకు చెందిన యశోద, రాజు దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బాలు(12) నాలుగో తరగతి చదువుతున్నాడు. పొలం దున్నేందుకు తండ్రి వెళ్తుండగా.. తానూ వస్తానని కొడుకు మారం చేయడంతో ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పొలం దున్నుతుండగా కుమారుడు రోటవేటర్‌లో పడిపోవడంతో శరీరం ఛిద్రమైపోయింది.

News June 11, 2024

MBNR: బాలికపై లైంగిక దాడి

image

బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబీకుల ప్రకారం.. కేటీదొడ్డి మం.లోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన కొండన్న ప్రేమ పేరుతో వేధించంగా బాలిక తల్లిదండ్రులు అతడిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాకపోగా.. గత మే నెలలో బాలికపై సదరు వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం బాలిక DSPకి ఫిర్యాదు చేసింది.