Telangana

News June 11, 2024

కరీంనగర్‌కు ఇది రెండోసారి!

image

KNR MPగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఆయన హోం శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు. అమిత్‌ షా నేతృత్వంలో సహాయ మంత్రిగా బండి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాకు ఈ మంత్రిత్వ శాఖ రావడం ఇది రెండోసారి. 1999లో KNR నుంచి గెలిచిన విద్యాసాగర్‌రావుకు ఇదే శాఖను కేటాయించారు. యాదృచ్ఛికంగా ఇద్దరు నాయకులకు రెండోసారి గెలిచిన తర్వాతే హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు.

News June 11, 2024

HYD: వర్షాకాల ప్రణాళికపై ఎండీ సుదర్శన్‌రెడ్డి సమీక్ష

image

వర్షాకాలంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తగిన మోతాదులో క్లోరిన్‌ శాతం ఉండేలా చూసుకోవాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. సోమవారం HYD ఖైరతాబాద్‌‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వర్షాకాల ప్రణాళికపై ఎండీ సుదర్శన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాంపిల్‌ కలెక్షన్‌, పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.

HYD: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ ఒప్పందం

image

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ వేతనాలు, పెన్షన్లు, ప్రమాద బీమా వంటి అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర పోలీసులకు ఇస్తున్న కవరేజీ, సేవలు, ప్రత్యేక ఆఫర్లను అగ్నిమాపకశాఖ సిబ్బందికి కూడా అందించనున్నారు. ఈ మేరక అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై.నాగిరెడ్డి, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ హెడ్‌ రితేశ్‌ కుమార్‌ సోమవారం ఎంవోయూపై సంతకాలు చేశారు.

డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఐఈఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో చేరేందుకు డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైందని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సామినేని సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని చెప్పారు.

News June 11, 2024

కామారెడ్డి: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

జుక్కల్ మండలంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఎస్సై వివరాల ప్రకారం.. సోపూర్ కు చెందిన లాలప్పకు(75) ఇద్దరు కొడుకులు. లాలప్ప తనకున్న భూమిలో కొడుకులకు వాటా ఇచ్చి భిక్షాటన చేస్తున్నాడు. అయితే చిన్న కుమారుడు సుభాష్ చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తరచూ గొడవపడేవాడు. భూమిని సుభాష్ ఎక్కడ అమ్ముతాడోనని లాలప్ప కొంత భూమి కోడలి పేరుపై మార్చారు. దీంతో కోపం పెంచుకున్న సుభాష్ తండ్రిని హత్య చేశాడు.

News June 11, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్త హంగులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్తగా మారనుంది. మార్కెట్‌కు నూతన హంగులు సంతరించుకోనున్నాయి. దేశంలోనే అధునాతన, మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు రూ.100కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2లక్షల బస్తాలు వచ్చినా ఇబ్బంది లేకుండా 17ఎకరాల విస్తీర్ణంలో 6 నుంచి 7 భారీ షెడ్ల నిర్మాణానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, ఇతర నిర్మాణాలకు సైతం ప్రణాళికలు రచిస్తున్నారు.

News June 11, 2024

KNR: సాగులో విత్తన ఎంపిక ప్రధానం

image

వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. తొలకరి పలకరించడంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. పంటల సాగులో మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవడం ఎంతో ప్రధానం. పలు ప్రైవేట్‌ విత్తన కంపెనీలు ఆకర్షణీయ ప్యాకింగ్‌తో, నకిలీ లేబుళ్లతో రైతులను మోసం చేస్తున్నాయి. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకొని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి దిగుబడులు సాధించాలి.

News June 11, 2024

బల్మూరు: RTC డ్రైవర్‌పై యువకుల దాడి

image

గుర్తు తెలియని వ్యక్తులు RTC తాత్కాలిక డ్రైవర్‌పై దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. అమిస్తాపూర్‌కు చెందిన శ్రీనివాసులు నాగర్ కర్నూల్ RTC డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అమిస్తాపూర్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద గుర్తు తెలియని నలుగురు యువకులు కారులో వచ్చి బస్సు కారుకు దారి ఇవ్వలేదంటూ డ్రైవర్‌పై దాడి చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు.