India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD నారాయణగూడలో అక్టోబర్ 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకు పెద్ద సదర్ ఉత్సవ మేళా జరగనుంది. ఈ మేరకు రామ్‌కోటి, లింగంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అధికారులు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.

రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిందని, పత్తి రైతులను ఆదుకుంటామని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తన బ్యాచ్‌మేట్, ఐపీఎస్ అధికారి చింత కుమార్‌ను కలిసేందుకు హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట గ్రామానికి ఆకస్మికంగా వచ్చారు. సెలవుపై స్వగ్రామంలో ఉన్న చింత కుమార్‌తో గౌష్ ఆలం ఆప్యాయంగా సమావేశమై, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత వృత్తి బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ సీపీ చేసిన ఈ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు లేఖ రాశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు సహకరించాలన్నారు. ఇప్పటికే ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

HYD అంబర్‌పేట్‌లో బాణసంచా వివాదం ఘర్షణగా మారింది. దీపావళి వేళ రాత్రి 11:30 గంటల సమయంలో సుధా పార్టీ నివాసం వద్ద పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాణసంచా పేల్చుతూ శబ్ద కాలుష్యం సృష్టించారు. వారికి స్థానిక మహిళ నిర్మల అడ్డు చెప్పగా ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల హీట్ పెరుగుతోంది. అంచనాలను మించి అభ్యర్థుల రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారి వద్ద నుంచి RO నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా నామినేషన్లు డబుల్ సెంచరీ దాటే సూచనలు కనిపిస్తున్నాయి.

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్‌తో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ₹25 కోట్లతో కళాశాల బ్లాక్ (G+2), హాస్టల్ (G+3) నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన సానిటరీ, వాల్ పుట్టి పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధమే” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటానని, లేదంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.

HYDజూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా క్యూలో 100కు పైగా నామినేషన్ల సెట్లు ఉన్నాయి. ఈరోజు సా.6.30 వరకు మొత్తం 80 దాఖలయ్యాయి. సా.3లోపు ఆర్వో ఆఫీస్ లోపలికి వెళ్లిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కో నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.ఈరోజు చివరి తేదీ కావడంతో అభ్యర్థులు పోటెత్తారు.
Sorry, no posts matched your criteria.