Telangana

News August 29, 2025

నిజామాబాద్: రాష్ట్రంలోనే టాప్ తూంపల్లి

image

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. సిరికొండ మండలం తూంపల్లిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.

News August 29, 2025

NLG: నేడు రైతు కమిషన్ బృందం పర్యటన

image

బత్తాయి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం నేడు, రేపు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి, గుంటిపల్లి గ్రామాల్లో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డితో పాటు పలువురు సభ్యులు గ్రామాల్లోని బత్తాయి, పామాయిల్ ఆయా తోటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

News August 29, 2025

వరంగల్: గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన..!

image

వరంగల్ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల వారిగా జీపీ కార్యాలయాల ఎదుట కార్యదర్శులు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాపై పూర్తిగా వివరించారు. ఈనెల 30లోపు వివిధ పార్టీల నాయకులు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని సూచించారు.

News August 29, 2025

NZB: బేస్‌బాల్ నేషనల్స్‌కు జీజీ కాలేజ్ విద్యార్థులు

image

జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్షిప్‌కు గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలమణి తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన మహిళల జట్టులో జి.శృతి, పురుషుల జట్టులో కే.సాయికుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 29 నుంచి మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే 38వ సీనియర్ నేషనల్ బేస్ బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.

News August 29, 2025

NZB: ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన

image

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.

News August 29, 2025

NZB: క్రీడా పోటీలు రద్దు

image

క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ క్రీడా పోటీలను రద్దు చేస్తున్నట్లు DYSO (FAC) పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 31 వరకు వెల్లడించిన షెడ్యూల్డ్‌లో భాగంగా 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన హాకీ, బాస్కెట్ బాల్ టోర్నమెంటును వర్షం కారణంగా రద్దు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణకు మైదానం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

News August 29, 2025

ఇచ్చోడ: ఓటర్ ఐడిలో మార్పులు.. నిందితులకు రిమాండ్: సీఐ

image

ఓటరు ఐడి నుంచి ఓట్లను వేరే గ్రామానికి మార్చిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. అడేగామబికి చెందిన మాజీ సర్పంచి వనిత, భర్త సుభాశ్ ఓట్లను కొందరు రెవెన్యూ అధికారి సహాయంతో వేరే గ్రామానికి మార్చారన్నారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులు విశాల్, అచ్యుత్, ధనరాజ్, రెవెన్యూ ఆర్ఐ హుస్సేన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

News August 29, 2025

ఖమ్మం: డెంగీ ఏలిషా యంత్రాల టెండర్లకు ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాకు 5 డెంగీ ఏలిషా వాషర్, రీడర్ యంత్రాలను సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు DMHO కళావతి బాయి తెలిపారు. ఆసక్తిగల సరఫరాదారులు జిల్లా కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఆగస్టు 31వ తేదీ లోపు తమ టెండర్లను సమర్పించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 3 గంటలకు వాటిని ఫైనల్ చేయనున్నట్లు ఆమె వివరించారు.

News August 29, 2025

మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా కరీంనగర్

image

కరీంనగర్ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, అపరిశుభ్ర లాట్రిన్‌లపై సర్వే నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన్ 20వ తేదీ వరకు 318 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలో ఈ సర్వే జరిగింది. సర్వేలో ఎవరూ మాన్యువల్ స్కావెంజర్లు లేరని, అపరిశుభ్ర లాట్రిన్లు కూడా లేవని తేలింది. దీంతో కరీంనగర్ జిల్లాను మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ప్రకటించారు.

News August 29, 2025

NLG: భారత సైన్యం ఆహ్వానిస్తుంది.. దరఖాస్తు చేసుకోండి

image

భారత సైన్యంలో అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ పోస్టుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అభ్యర్థులు JAN 2005 నుంచి JUL 2008 మధ్య జన్మించి ఉండాలని, ఇంటర్ లేదా డిప్లొమాలో ఏదైనా గ్రూపులో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.