Telangana

News June 11, 2024

మంచిర్యాల: రైల్వే టీసీ పై పెట్రోల్ పోసి దాడికి యత్నం

image

మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న రాజు అనే టికెట్ కలెక్టర్ పై ఒప్పంద కార్మికుడు దాడికి యత్నించాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నట్లు సమాచారం. సోమవారం రైల్వే స్టేషన్ లో వీరి మధ్య వివాదం తలెత్తగా ఒప్పంద కార్మికుడు.. రాజుపై పెట్రోల్ పోసి దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తం కావటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై కేసు నమోదైనట్లు సమాచారం.

News June 11, 2024

HYD: కాల్ చేశారు.. రూ.41.28 లక్షలు కొట్టేశారు..!

image

క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాలు ఇప్పిస్తామని ఓ సర్జన్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జూబ్లీహిల్స్‌కి చెందిన ఓ బేరియాట్రిక్ సర్జన్ తన ఫేస్ బుక్‌లో coinmarket.win అనే లింక్ కనిపించడంతో దాన్ని క్లిక్ చేశాడు. ఓ యాప్ ఓపెన్ అవగా ఓ వ్యక్తి కాల్ చేసి రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు ఇస్తామన్నాడు. నమ్మిన సర్జన్ విడతల వారీగా రూ.41.28లక్షలు పెట్టి మోసపోయి PSలో ఫిర్యాదు చేశాడు.

కేయూ పరిధిలో జులై 1 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహచారి తెలిపారు. మొదటి పేపర్ జూలై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

News June 11, 2024

KNR: బాలికపై అత్యాచారం.. చివరకు జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయపూర్తి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. సీఐ రఘుపతి ప్రకారం.. సిరిసిల్లకు చెందిన పదేళ్ల బాలిక ఇంటికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో రాజీవ్‌నగర్‌కు చెందిన రాహుల్ 2023లో అత్యాచారానికి పాల్పడ్డాడు. తప్పించుకొని ఇంటికి వెళ్లిన బాధితురాలు ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం నేరం రుజువయింది.

News June 11, 2024

నల్గొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిగురిస్తున్న ఆశలు

image

కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని కేబినెట్ మీటింగ్‌లో విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. నూతన కార్డుల కోసం 39,874, కార్డుల్లో మార్పునకు 63,691 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 10,07,090 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 29,84,569గా ఉంది.

News June 11, 2024

HYD: గృహజ్యోతి పథకం పునః ప్రారంభం..!

image

ఎన్నికల కోడ్ ముగియడంతో గృహజ్యోతి పథకం పునః ప్రారంభించామని అధికారులు తెలిపారు. RR, VKB పరిధిలో దీనిని ప్రారంభించగా 3.73 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఇక HYD, మేడ్చల్ పరిధిలో ఇప్పటికే కొనసాగుతోందన్నారు. అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారు.. చేసుకున్నా సాంకేతిక కారణాలతో సున్నా బిల్లులు రానివారు GHMC ప్రజాపాలన కేంద్రాల్లో అప్లై చేయాలని అధికారి ఆనంద్ తెలిపారు. SHARE IT

HYD: పూల బొకేలు, శాలువాలు వద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తనను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు పూల బొకేలు తీసుకురావద్దని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పూల బొకేలు, శాలువాలకు బదులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చేందుకు నోటు బుక్కులు, స్ఫూర్తిదాయకమైన కథల పుస్తకాలు తెస్తే బాగుంటుందని కోరారు. కేంద్ర మంత్రి నిర్ణయంపై అందరూ భేష్ అంటున్నారు.

News June 11, 2024

NGKL: నామినేటెడ్ పోస్టులపై నేతల్లో ఆశలు !

image

ఎన్నికల కోడ్ ముగియడంతో నామినేటెడ్ పోస్టులపై జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ పోస్టులు మొదలుకొని ఇక్కడి ప్రముఖ దేవాలయాలు, మార్కెట్ కమిటీలు ఎక్కడ అవకాశం ఉన్నా దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇటీవల కొల్లాపూర్ జగదీశ్వర్ రావుకు మైనర్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కగా, ZP వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్‌కు PCB మెంబర్‌గా అవకాశం వచ్చింది.