Telangana

News June 11, 2024

వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: సీతక్క

image

వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా, అధిక వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News June 11, 2024

ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT

News June 11, 2024

జగిత్యాల: పాఠశాలలను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా తరగతి గదులు శుభ్ర పరచడం, మౌలిక సదుపాయాలు కల్పన జరగాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పాఠ్య పుస్తకాలను, నోటు పుస్తకాలను సిద్ధం చేయాలన్నారు. యూనిఫామ్స్ అందించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

News June 11, 2024

ప్రజావాణి ఫిర్యాదులకు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వారంలో ఫిర్యాదుదారునికి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. MBNR కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయా MROలను ఆదేశించారు.

News June 11, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలి: సీతక్క

image

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.

News June 11, 2024

ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT

News June 11, 2024

ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT

News June 11, 2024

HNK: ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు అజాగ్రత్తగా ఉండొద్దు: TDC

image

ప్రవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలు, డ్రైవర్లు నిబంధనలను పాటించాలని ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఉప్పల శ్రీనివాస్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ భవన్లో వడుప్సా ఆధ్వర్యంలో డ్రైవర్లు, హెల్పర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు అజాగ్రత్తగా ఉండొద్దన్నారు.

News June 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో బావిలో పడి యువకుడు మృతి. @ జగిత్యాల ప్రజావాణిలో 48 ఫిర్యాదులు. @ పెద్దపల్లి ప్రజావాణిలో 43 ఫిర్యాదులు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎంహెచ్వో తనిఖీలు. @ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. @ జిల్లాలో ప్లాస్టిక్ ను నిషేధించాలన్న జగిత్యాల కలెక్టర్. @ మంత్రి సీతక్కతో వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల అధికారులు.

News June 10, 2024

మానవత్వం చాటుకున్న నిర్మల్ పోలీసులు

image

నిర్మల్ పట్టణ పోలీసులు అజార్ ఖాన్, రాథోడ్ అనిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలో డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో మతిస్థిమితం లేని ఓ మహిళ దుస్తులు లేకుండా రోడ్డు పై కనబడింది. దీంతో ఆ మహిళకు తమ సొంత ఖర్చులతో దుస్తులు కొనిఇచ్చి స్థానిక మహిళల సహాయంతో బట్టలు తొడిగించారు. తమ విధులతో పాటు సామాజిక సేవలో ముందున్న పోలీసులను స్థానికులు అభినందించారు.