Telangana

News June 10, 2024

పాలమూరు జిల్లా “TODAY TOP NEWS”

image

✓అలంపూర్: వైభవంగా బాల బ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం.
✓ వికారాబాద్ -రాయచూర్ రైల్వే సర్వే పనులు ప్రారంభం.
✓ ఉమ్మడి పాలమూరు జిల్లా మూడు రోజుల వర్ష సూచన.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లో కొనసాగిన ప్రజావాణి.
✓ కేంద్ర మంత్రులను కలిసిన బిజెపి నేత పోతుగంటి భరత్.
✓బొంరాస్ పేట: మహిళా సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కు ఫిర్యాదు.
✓ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బడిబాట.

News June 10, 2024

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన జిల్లా అధికారులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలు, వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు, అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.

News June 10, 2024

NZB: విధుల్లో చేరనున్న 88 మంది PTI, 19 మంది CGVలు

image

2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు (PTI), కేర్‌ గివింగ్‌ వాలంటీర్లు (CGV)లను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సమగ్ర శిక్ష ఎక్స్‌ అఫిషియో స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డా.మల్లయ్య భట్టు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 88 మంది PTIలు, 19 మంది CGVలు విధుల్లో చేరనున్నారు.

News June 10, 2024

నాగిరెడ్డిపేట: ఎంపీపీని సన్మానించిన ఐకేపీ ఏపీఎం

image

నాగిరెడ్డిపేటలోని మహిళా సమైక్య కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎంపీపీ బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి వినీతను మండల సమైక్య అధ్యక్షురాలు సుశీల, ఐకేపీ ఏపీఎం జగదీశ్ శాలువాతో సన్మానించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ఎంపీపీని సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News June 10, 2024

‘ధరణి పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయాలి’

image

ధరణి పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవిన్యూ అధికారులతో ధరణి, రిజిస్ట్రేషన్ల పెండింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి ఫిజికల్ ఫైళ్ల ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు.

News June 10, 2024

NZB: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

image

జిల్లాలోని సిర్నాపల్లి, ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పైన సోమవారం గుర్తు తెలియని మగ వ్యక్తి (35) మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైలులో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్యం చేశారు. మృతుడి కుడి చేయి పైన కవిత అని పచ్చ బొట్టు ఉన్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

News June 10, 2024

ఓయూ: 19వ తేదీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.

News June 10, 2024

HYD: 19వ తేదీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షలు

HYD: నీట్ పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలి: R.కృష్ణయ్య

image

జూన్ 4న విడుదలైన నీట్ పరీక్ష 2024 ఫలితాలు, నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున, నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై CBIచే విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ R.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. విద్యానగర్ హిందీ మాహా విద్యాలయం నుంచి BC భవన్ వరకు విద్యార్థులతో ఆయన ర్యాలీ నిర్వహించారు.