Telangana

News June 10, 2024

HYD: మల్లారెడ్డి TDPలోకి వెళ్లడం లేదు: అనుచర వర్గం

image

మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి TDPలోకి వెళ్తున్నారని, ఆయనకు TTDP అధ్యక్ష పదవి వస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఈరోజు మేడ్చల్‌లో మల్లారెడ్డి అనుచర వర్గం స్పందించింది. ఆ వార్త ఫేక్ అని, ప్రజలు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. ఆయన TDPలో చేరేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని, BRSలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

VMWD: శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి 4గంటల సమయం

image

దక్షిణ కాశీగా పేరొందిన, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి 4గంటల సమయం పడుతోంది. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

News June 10, 2024

WGL: ట్రాక్టర్ కిందపడి బాలుడి దుర్మరణం

image

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోతు రాజు సోమవారం పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్ వేసుకెళ్లాడు. అతని కుమారుడు బాలు(7)ను తన వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న బాలు.. ట్రాక్టర్ వెనక వైపునకు వచ్చాడు. అది గమనించని తండ్రి రాజు రివర్స్ తీస్తుండగా రోటవేటర్‌లో చిక్కుకుని మృతిచెందాడు. 

News June 10, 2024

నేడు పల్లె నిద్రలో మెదక్ కలెక్టర్, అధికారులు

image

మెదక్ జిల్లాలో బడిబాట విజయవంతానికి కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నర్సాపూర్ మండలం జక్కపల్లిలో కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లె నిద్ర చేయనున్నారు. చదువుకోవడం వల్ల మానసిక పరిపక్వత సాధించవచ్చని, చదువు చాలా ఉన్నతమైనది చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి, ప్రతి ఒక్క అధికారి 100 ఇళ్లు సర్వే చేయాలన్నారు.

News June 10, 2024

MBNR: ఉత్కంఠ పోరులో గెలిచినా.. మంత్రి పదవి దక్కలే !

image

MBNR ఎంపీగా ఉత్కంఠ పోరులో గెలిచిన డీకే అరుణకు కేంద్ర పదవి దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. MBNR లోక్ సభ పరిధిలో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరు కాంగ్రెస్ MLAలే ఉండి, సీఎం సొంత జిల్లాలో ఆ అభ్యర్థిపై తలపడి ఉత్కంఠ పోరులో 4500 ఓట్ల మెజార్టీతో అరుణ గెలవడంతోపాటు సీనియర్ నాయకురాలు కావడంతో మంత్రి పదవి దక్కుతుందని భావించినా, రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

News June 10, 2024

BREAKING: సికింద్రాబాద్ మహంకాళి బోనాల తేదీల ప్రకటన

image

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తేదీలను దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, అర్చకులు సోమవారం వెల్లడించారు. జులై 7న ఘటోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జులై 21న బోనాలు.. 22న భవిష్యవాణి (రంగం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. SHARE IT

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి హుండీ ఆదాయం లెక్కింపు

image

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, అధికారుల సమక్షంలో లెక్కింపు జరిగింది. 2 నెలల 15 రోజులకు గాను రూ.23,91,023 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపులో ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రామేశ్వర్, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.