Telangana

News June 10, 2024

మంత్రి పొంగులేటిని కలిసిన తీన్మార్ మల్లన్న

image

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. తన గెలుపు కోసం కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

News June 10, 2024

వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: పొంగులేటి

image

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దన్నారు. నీటి ప్రవాహంలో ఉన్న కాలువలు, కల్వర్టులను దాటొద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడిసిన విద్యుత్ స్తంభాలను తాకొద్దని, ప్రయాణాలను కూడా కొత్త మార్గాల్లో కాకుండా రోజు వెళ్లే దారిలోనే ప్రయాణించాలని పేర్కొన్నారు.

News June 10, 2024

20 ఏళ్లకు మళ్లీ కరీంనగర్‌కు కేంద్రమంత్రి పదవి

image

కరీంనగర్ పార్లమెంటుకు 20 ఏళ్ల తర్వాత కేంద్రమంత్రి పదవి వరించింది. KCR 2004 జనరల్ ఎన్నికల్లో కరీంనగర్ MP స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2004-06 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. అంతకముందు 1998, 1999ఎన్నికల్లో గెలుపొందిన సీహెచ్ విద్యాసాగర్‌రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక KNR నుంచి కేంద్రమంత్రి పదవి పొందిన మొదటివ్యక్తిగా సంజయ్ నిలిచారు.

News June 10, 2024

HYD: నీట్ స్కామ్‌లో బీజేపీ నేతలు: చనగాని

image

నీట్-2024 పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. HYD గాంధీభవన్‌లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో దయాకర్ మాట్లాడారు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ స్కామ్‌లో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.

NZB: ఈ నెల 12న ఉద్యోగ మేళా

image

జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 12న ఉపాధి కార్యలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేళాలో పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. SSC, ITI ఎలక్ట్రిషన్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 10, 2024

నెన్నెల: ప్రజావాణికి పురుగు మందుతో వచ్చిన రైతు

image

నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్దన్ అనే రైతు పురుగు మందు డబ్బాతో వచ్చాడు. తన సమస్య పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కిష్టాపూర్ IKPకేంద్రం ఆధ్వర్యంలో తను మామిడి కాయలు అమ్మినట్లు తెలిపాడు. రూ.1.50లక్షలు వరకు కేంద్రం నుంచి రావాలని, నెల రోజులైనా అధికారులు డబ్బు చెల్లించడం లేదని వాపోయాడు. ఎన్నిసార్లు కేంద్రం చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదన్నాడు.

News June 10, 2024

ఓయూలో బీఎఫ్ఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) (అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ) తదితర కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు రెండు, మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 13వ తేదీలోగా చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 20వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.

News June 10, 2024

మిర్యాలగూడ: గ్రేట్.. పేరేంట్స్ చనిపోయినా లక్ష్యం వదల్లేదు..

image

మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లికి చెందిన కుంచం శివ తల్లిందండ్రులు లేరనే బాధను దిగమింగి ఐఐటీ జేఈఈలో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 211, బీసీ కేటగిరీలో 24లో ర్యాంకు సాధించాడు. ఆరేళ్ల క్రితం శివ తల్లి జ్యోతి అనారోగ్యంతో చనిపోగా, నాలుగేళ్ల క్రితం తండ్రి శ్రీను భూగర్భ డ్రైనేజీలో ఊపిరాకడ మృతిచెందాడు. దీంతో మేనమామ నోముల నాగార్జున దగ్గర ఉండి చదువుల్లో రాణిస్తున్నాడు.