Telangana

News June 10, 2024

MHBD: పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఒకరు ఆత్మహత్య

image

ఇద్దరమ్మాయిల ప్రేమ చివరికి విషాదంగా మారింది. MHBD జిల్లా కురవి (M)కి చెందిన ఓ యువతికి(21), బయ్యారానికి చెందిన మరో యువతి(20) ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి HYDకు వెళ్లిపోయారు. వివాహం చేసుకొని సహజీవనం చేస్తుండగా పెద్దలు వారిని విడదీశారు. కురవి(M)కి చెందిన అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న మరో యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

News June 10, 2024

పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఒకరు ఆత్మహత్య

image

ఇద్దరమ్మాయిల ప్రేమ చివరికి విషాదంగా మారింది. MHBD జిల్లా కురవి (M)కి చెందిన ఓ యువతికి(21), బయ్యారంకు చెందిన మరో యువతి(20) ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి HYDకు వెళ్లిపోయారు. వివాహం చేసుకొని సహజీవనం చేస్తుండగా పెద్దలు వారిని విడదీశారు. కురవి(M)కి చెందిన అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న మరో యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

News June 10, 2024

భైంసా: ప్రాజెక్టులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

image

ప్రాజెక్టులో గల్లంతైన విద్యార్థి మృతదేహం సోమవారం లభ్యమైంది. భైంసా పట్టణం పిప్రి కాలానికి చెందిన సోలంకె పవన్(18)
ఆదివారం స్నేహితులతో కలిసి సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారీ ప్రాజెక్టులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి వరకు గాలించినప్పటికీ మృతదేహం లభ్యమవ్వలేదు. సోమవారం ఉదయం మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.

News June 10, 2024

MDK: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

వర్షాకాలం ఆరంభం కానున్న సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఏటా ఆషాఢం, శ్రావణమాసంలో ధరలు పెరిగి సామాన్యులను కుదేలు చేస్తుంటాయి. మెదక్ జిల్లాలో గతేడాది సరైన వర్షాలు పడకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈసారి స్థానికంగా కూరగాయల సాగు, దిగుబడి తగ్గింది. పది రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 నుంచి 80 ఉండగా.. ప్రస్తుతం రూ.120 పలుకుతోంది.

News June 10, 2024

HYD: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

వర్షాకాలం ఆరంభం కానున్న సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఏటా ఆషాఢం, శ్రావణమాసంలో ధరలు పెరిగి సామాన్యులను కుదేలు చేస్తుంటాయి. రంగారెడ్డి జిల్లాలో గతేడాది సరైన వర్షాలు పడకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈసారి స్థానికంగా కూరగాయల సాగు, దిగుబడి తగ్గింది. పది రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 నుంచి 80 ఉండగా.. ప్రస్తుతం రూ.120కి చేరింది.

News June 10, 2024

HYD: పంచాయతీ కార్యదర్శి మృతి

image

గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి వస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషయం తెలిసిందే. బొంరాస్ పేట్ మండలంలానికి చెందిన సుమిత్రాబాయి(29) VKBDలో నిర్వహించిన పరీక్ష రాసి భర్తతో కలిసి ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో వర్షం పడుతుందని సుమిత్ర తన వద్ద ఉన్న గొడుగు తీసే ప్రయత్నంలో గట్టెపల్లి వద్ద కిందపడింది. దీంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలు కావడంతో తాండూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 10, 2024

HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సులలో శిక్షణ

image

సైబర్ సెక్యూరిటీ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎథికల్ హ్యాకింగ్ తదితర కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

News June 10, 2024

HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సులలో శిక్షణ

image

సైబర్ సెక్యూరిటీ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎథికల్ హ్యాకింగ్ తదితర కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

News June 10, 2024

శాయంపేట: కొడుకు కోపం.. తల్లి మృతి

image

కుమారుడి క్షణికావేశంలో తల్లి మృతి చెందింది. CI రంజిత్‌రావు కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట(M) కొప్పుల వాసి తిరుపతిరెడ్డి శనివారం పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో తిరుపతిరెడ్డి భార్యను కొడుతుండగా తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పక్కనే ఉన్న మంచం పట్టెతో తల్లిని కొట్టడంతో, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. కేసు నమోదైంది.

News June 10, 2024

‘రఘువీర్‌కి భారీ మెజార్టీ ఇచ్చి చరిత్ర సృష్టించారు’

image

నల్గొండ ఎంపీ రఘువీర్‌కి 5లక్షల పైచిలుకు మెజార్టీ ఇచ్చి చరిత్ర సృష్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీపై అవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం లేనందునే 63 సీట్లు తగ్గాయని, అదే సమయంలో కాంగ్రెస్ బలం రెట్టింపు అయిందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే తీర్పును ప్రజలిచ్చారని తెలిపారు.