Telangana

News June 10, 2024

MBNR: 3023 మంది అభ్యర్థులు గైర్హాజరు

image

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాల్లో సజావుగా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 15,199 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 12,176 మంది మాత్రమే హాజరయ్యారు. 3023 మంది అభ్యర్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. అంటే 80.11 శాతం మంది పరీక్ష రాశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

News June 10, 2024

ఖమ్మంలో దొంగలు హల్‌చల్

image

ఖమ్మం జిల్లాలో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు గట్టినిఘా పెట్టినా వారి కళ్లు గప్పి దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం కొత్తబస్టాండ్‌లో చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.6 లక్షల విలువైన బంగారు అభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 10, 2024

ఆదిలాబాద్: తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు..!

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మినహా దాదాపు అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదిలాబాద్‌లో 39.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు తెలిపింది.

News June 10, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దోస్త్ హెల్ప్ లైన్ వివరాలు ఇలా…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దోస్త్ రిజిస్ట్రేషన్ హెల్ప్ లైన్‌కు జిల్లాల వారీగా అధికారుల వివరాలు ఇలా మహబూబ్నగర్ ఈశ్వరయ్య, తేజస్విని ఫోన్ నం. 9440831876, 8977980981, WNP శ్రీనివాస్, యాదగిరి గౌడ్ 9490000670, 9491167549, NGKL మధుసూదన్ శర్మ, ధర్మ 9440842201, 9963375850, GDWL హరిబాబు, అనిల్ కుమార్ 8008259315, 8019826401, NRPT నారాయణ గౌడ్, భీమరాజు 9440837053, 9959381282 నం. సంప్రదించాలని కోరారు.

News June 10, 2024

JEE ఫలితాల్లో అదరగొట్టిన నిజామాబాదీలు

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన విద్యార్థి జ్యోతి సమన్విత్ JEE అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలో 833వ జనరల్ ర్యాంక్ సాధించాడని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. అలాగే OBC NCL కేటగిరిలో 121 వ ర్యాంకు సాధించాడు. ముప్కాల్ మండలం వేంపల్లికి చెందిన చరణ్ ఓపెన్ క్యాటగిరిలో 51వ ర్యాంకు సాధించాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరిమల్లకు చెందిన హర్షత్ గౌడ్ JEEలో 8879 ర్యాంకు సాధించాడు.

News June 10, 2024

KNR: విడిపోయిన కుటుంబాన్ని కలిపిన మంత్రి

image

ఎస్ పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల భిక్షపతి, శ్రీనివాస్, వెంకటేష్ అనే ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలు 14 ఏళ్ల క్రితం గొడవలతో విడిపోయాయి. ఈ విషయాన్ని స్థానికులు తెలియజేయడంతో ఆదివారం తన పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ముగ్గురు అన్నదమ్ములను కలిపారు. కలిసి ఉంటే కలదు సుఖం అంటూ వారితో మాట్లాడి ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కలిపారు. గొడవలు పెట్టుకోకుండా అందరూ కలిసి ఉండాలని వారికి సూచించారు.

News June 10, 2024

శాయంపేట: కోడుకు కోపం.. తల్లి మృతి

image

కుమారుడి క్షణికావేశంలో తల్లి మృతి చెందింది. CI రంజిత్‌రావు కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట(M) కొప్పుల వాసి తిరుపతిరెడ్డి శనివారం పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో తిరుపతిరెడ్డి భార్యను కొడుతుండగా తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పక్కనే ఉన్న మంచం పట్టెతో తల్లిని కొట్టడంతో, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. కేసు నమోదైంది.

News June 10, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News June 10, 2024

HYD: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగింపు

image

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణీ కర్యక్రమం నేటి నుంచి కొనసాగుతుందని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో యథావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దరఖాస్తు రూపంలో ప్రజలు తమ సమస్యలను అందించవచ్చునని తెలిపారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ద్వారా 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను విన్నవించవచ్చని సూచించారు.

News June 10, 2024

HYD: పాముకాటుకు గురై ఇంటర్ విద్యార్థి మృతి

image

పాముకాటుతో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. అల్లాకోట్‌కు చెందిన ఎడెల్లి రవి తన కుటుంబంతో నిద్రిస్తున్నారు. ఈక్రమంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూతురు పూజ(16) కుడికాలుకు పాము కాటేసింది. పూజను ఆసుపత్రికి తరలించగా..  చికిత్స పొందుతూ మృతి చెందింది.