Telangana

News June 10, 2024

HYD: పాముకాటుకు గురై ఇంటర్ విద్యార్థి మృతి

image

పాముకాటుతో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. అల్లాకోట్‌కు చెందిన ఎడెల్లి రవి తన కుటుంబంతో నిద్రిస్తున్నారు. ఈక్రమంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూతురు పూజ(16) కుడికాలుకు పాము కాటేసింది. పూజను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 10, 2024

NZB: గుర్తు తెలియని మృతదేహం..తెలిస్తే చెప్పండి

image

నిజామాబాద్ పులాంగ్ చౌరస్తా బ్రిడ్జి దాటిన తరువాత యాదగిరి బాగ్ కమాన్ ఎదురుగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని నిజామాబాద్ 4వ టౌన్ SHO తెలిపారు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసుగల ఈ వ్యక్తి రోడ్డు దాటుతుండగా కిందపడి దెబ్బలు తగిలి మరణించాడన్నారు. ఇతని వివరాలు తెలిసినవారుSHO NZB 4 Town 8712659840, NZB 4 town PS 8712659719 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News June 10, 2024

భైంసా: సెల్ఫీ కోసం వెళ్లి యువకుడు గల్లంతు

image

సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు నీటలో గల్లంతైన ఘటన ఆదివారం భైంసాలో చోటుచేసుకుంది. ఏపీనగర్కు చెందిన సోలంకి పవన్(18)తన స్నేహితులతో కలిసి గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద బండపై కూర్చొని సెల్ఫీ దిగుతుండగా సూర్యవంశీ చెప్పు నీటిలో పడిపోయింది. దానిని తీసేందుకు పవన్, శివ కార్తీ నీటిలో దిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు శివ, కార్తీను రక్షించగా పవన్ గల్లంతయ్యాడు. చీకటి పడడంతో ఆచూకీ లభించలేదు.

News June 10, 2024

MDK: ఎందుకు ఓడిపోయాం..?

image

ఉమ్మడి మెదక్ జిల్లా BRSకు కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల ఫలితాలలో కారు జోరుకు బ్రేకులు పడటంతో BRS శ్రేణుల్లో ఎందుకు ఓడిపోయామనే అంతర్మథనం జరుగుతోంది. రాష్రంలోనే గెలుపొందే సీట్లలో మెదక్ స్థానం తప్పక ఉంటుందని భావించారు. కానీ, అంచనాలు తలకిందులయ్యాయి. BRS మూడో స్థానంలో నిలించింది. పట్టు ఉన్న జిల్లాలో ఓటమి చెందటాన్ని నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.

News June 10, 2024

వరంగల్: పదోతరగతి విద్యార్థికి CM చేతుల మీదుగా అవార్డు

image

ఏటూరునాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 GPA సాధించిన విద్యార్థి శ్రీరామ్ బిందు సాయిలత నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోనుంది. ములుగు జిల్లా నుంచి వందేమాతరం ప్రతిభా పురస్కారానికి ఎంపికై, నేడు ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననుంది. దీంతో మండల ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 10, 2024

మాడ్గుల: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

image

తాటి చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన మాడ్గుల మండలంలోని కొల్కులపల్లిలో చోటు చేసుకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ (53) రోజు మాదిరిగానే ఆదివారం పొలం వద్ద కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు గీస్తుండగా మోకు జారి పడిపోయి వెంకటయ్యగౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 10, 2024

ADB: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో గిరి విద్యార్థుల సత్తా

image

ఆదిలాబాద్ పట్టణంలో స్టార్ 50 పేరిట ఐటీడీఏ, గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులతో విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఎస్టీ కేటగిరి విభాగంలో పవార్ చంటి 422 ర్యాంకు, సాయి కృష్ణ 734 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబర్చారు. మరో 16 మందికి మంచి ర్యాంకులు వచ్చాయని, వారందరికి ఎస్టీ కోటాలో ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాలు లభిస్తాయని కేంద్రం ఇన్‌ఛార్జ్ మారుతి శర్మ తెలిపారు.

News June 10, 2024

KNR: రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

image

KNR-WGL జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13411201>>ఇద్దరు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాలిలా.. శంకరపట్నం(M)కొత్తగట్టుకి చెందిన మహేశ్‌(18), అరవింద్‌చారి(16) బైక్‌పై కేశవపట్నం వస్తున్నారు. ఈ క్రమంలో KNR-HZB వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్‌ ఇంటర్మీడియట్‌, అరవింద్‌చారి పదో తరగతి పూర్తి చేశాడు. SI లక్ష్మారెడ్డి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.

News June 10, 2024

మరుగుదొడ్డి విషయంలో గొడవ.. వివహిత సూసైడ్

image

అత్త, భర్త మందలించారని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోతె మండలంలో జరిగింది. రాంపురంతండాకు చెందిన నాగు దంపతులు ఉఫాధి కోసం HYDలో ఉంటున్నారు. కాగా ఈ దంపతులు 10రోజులక్రితం తండాకు వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం మొదలు పెట్టారు. కాగా ఈ విషయమై ఉమ ఆమె భర్త, అత్త మధ్య గొడవకు దారి తీసింది. దీంతో మనస్తాపానికి గురైన ఉమ గడ్డిమందు తాగింది. ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 10, 2024

ఇల్లందు: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

క్రికెట్ ఆడుతూ గుండెనొప్పికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇల్లెందులో ఆదివారం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలో 2బస్తీకి చెందిన బొల్లి కిరణ్ (27) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాగా ఆయాసం వచ్చింది. వెంటనే తోటి స్నేహితులు స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. కిరణ్‌ను పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం రిఫర్‌ చేశారు. ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు.