Telangana

News June 10, 2024

భూపాలపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

image

భూపాలపల్లి జిల్లా కమలాపూర్ శివారులోని రాంపూర్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రేగళ్ల నరేశ్(30, రేగళ్ల ప్రమోద్(25), సిద్ధూ బైక్‌పై రాంపూర్ వైపు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. నరేశ్ స్పాట్‌లోనే చనిపోగా, ప్రమోద్ హన్మకొండకు తరలిస్తుండగా మరణించాడు. నరేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News June 10, 2024

రైతుబంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు !

image

తెలంగాణలో రైతులు వానాకాలం పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నంగునూరు మండలం అక్కనపల్లిలో మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వర్షం పడగానే రైతుబంధు ఇచ్చేదని .. కానీ రేవంత్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు.

News June 10, 2024

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరిక

image

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులలో నాణ్యత ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అధికారులు అలక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లోని రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 85 పనులకు 2 నియోజకవర్గాల్లో కొత్త, రెన్యూవల్‌ కలిపి రూ.124.65 కోట్ల పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు

News June 10, 2024

MBNR: 15 ఏళ్లు పైబడితే..

image

దేశవాప్తంగా 15 ఏళ్లు పైపడిన అన్నిరకాల వాహనాలను స్క్రాప్ చేయాలని కేంద్ర ప్రభుత్వ యోచిస్తుంది. ఈ క్రమంలో మొదట 15 ఏళ్ల పైబడిన ప్రభుత్వ వాహనాలపై దృష్టిసారించనుంది. కాగా, 15 ఏళ్లు దాటిన వాహనాలు MHNRలో 42,378, నాగర్‌కర్నూల్ 10,776, వనపర్తి 7,346, గద్వాల 5,508, NRPTలో 7,076 వాహనాలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, త్వరలో ఓ స్పష్టమైన ఆర్డర్ వచ్చే అవకాశం ఉందని RTO రఘుకుమార్ తెలిపారు.

News June 10, 2024

ఖమ్మం : గ్రూప్-1 పరీక్షకు 20,504మంది హాజరు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా పరీక్షకు 20,504 మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 2,226మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్ష ఉ. 10.30 నుంచి ఒంటిగంట వరకు కొనసాగింది. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News June 10, 2024

పరిగి: ప్రశాంతగా ముగిసిన గ్రూప్‌-1 పరీక్ష

image

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష పరిగిలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరిగిలో పల్లవి డిగ్రీ కళాశాల, కేటీఎస్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 846 మంది అభ్యర్థులకు గానూ 651 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలు రాశారు. నిమిషం తేడా నిబంధన పెట్టడంతో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు తొమ్మిది గంటలలోపే చేరుకున్నారు.

News June 10, 2024

అదిలాబాద్: గడిచిన 20 రోజుల్లో 14 మంది మృతి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 20 రోజుల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందారు. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంద్రవెల్లి మండలం డోంగర్గాంలో ఆనక సంతోష్ (28), స్వప్న (26) యువ దంపతులు, చెన్నూర్, కౌటాల, దస్తురాబాద్, తలమడుగు, పెంబి మండలాల్లో పిడుగుపాటుకు పశువులు, వందలాది మేకలు మృత్యువాత పడ్డాయి.

News June 10, 2024

నవీపేట: పోలీస్ స్టేషన్ వద్దే చోరీ

image

నవీపేట పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తికి చెందిన బైక్ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. నవీపేట కుమ్మరికాలనీకి చెందిన మల్లేశ్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దీనిపై సదరు బాధితుడు శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. తన బైక్‌ను పోలీస్ స్టేషన్ పార్కింగ్ స్థలంలో తాళం వేసి నిలిపాడు. తిరిగి వచ్చే సరికి వాహనం కనిపించలేదు. విస్మయానికి గురైన ఆయన మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 10, 2024

HYD: లష్కర్‌లో గెలిస్తే కేంద్ర మంత్రి పదవి

image

లష్కర్‌లో ఎన్నికైతే కేంద్ర మంత్రి పదవి ఖాయమనే సంప్రదాయం మరోసారి నిజమైంది. ఇదే లోక్‌సభ స్థానానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ.. 1998, 2014లో 2సార్లు కేంద్ర మంత్రిగా చేశారు. 2019లో కిషన్ రెడ్డి ఇక్కడ విజయం సాధించి కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా, తర్వాత పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. 2024ఎన్నికల్లో గెలిచి రెండోసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు.

News June 10, 2024

HYD: లష్కర్‌లో గెలిస్తే కేంద్ర మంత్రి పదవి

image

లష్కర్‌లో ఎన్నికైతే కేంద్ర మంత్రి పదవి ఖాయమనే సంప్రదాయం మరోసారి నిజమైంది. ఇదే లోక్‌సభ స్థానానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ.. 1998, 2014లో 2సార్లు కేంద్ర మంత్రిగా చేశారు. 2019లో కిషన్ రెడ్డి ఇక్కడ విజయం సాధించి కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా, తర్వాత పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. 2024ఎన్నికల్లో గెలిచి రెండోసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు.