India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్లను ఈ నెల 29 నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు సెప్టెంబర్ 4 వరకు నేరుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా తమ పెన్షన్‌ను తీసుకోవచ్చని చెప్పారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు.
హైదరాబాద్ CP CV ఆనంద్ ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై అధికారుల నుంచి ఆరా తీశారు. అనంతరం ట్యాంక్‌బండ్ మీద నిమజ్జనం, పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గురువారం సందర్శించారు. డ్యాములోకి వస్తున్న వరద ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని కుంటలు, చెరువుల పరిస్థితిని ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ సదస్సుల సందర్భంగా అందిన భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్లతో సమావేశమైన ఆమె, దరఖాస్తుల్లో ఉన్న మార్పులు, చేర్పులు, మ్యుటేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కూడా పాల్గొన్నారు.
నల్గొండ ఎన్జీ కాలేజీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 30వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929610, 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని కొన్ని మండలాల్లో విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO అశోక్ తెలిపారు. ఈ మేరకు సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత యాజమాన్యాలు గమనించాలని ఆయన సూచించారు.
TG యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నూతన కోఆర్డినేటర్ నియామకం గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా కడారి కుమార్, ముక్కెర సతీష్ కుమార్ లు నియామకమయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్, ప్రశాంత్ లను కో-కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరితో పాటు 6 అసెంబ్లీ కోఆర్డినేటర్లను నూతనంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థల విజయం కోసం పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్రచారంలో నియామకాలు జరిగాయి.
NGKL జిల్లా పదర మండలానికి చెందిన బండి నందిని, మహిళల కబడ్డీ అండర్-18 విభాగంలో ఇండియా క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నందిని, గురువారం ఢిల్లీలోని సోనీపత్‌లో జరిగే ఇండియా క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు రమేశ్, రామాదేవి సంతోషం వ్యక్తం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్‌పల్లి, NZB రూరల్, జక్రాన్‌పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.
జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, భీమ్‌గల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. పై ప్రాంతాల్లో మూడు చెరువులు తెగిపోగా, సుమారు 12,413 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు చెప్పారు. నీట మునగడం వల్ల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.
Sorry, no posts matched your criteria.