Telangana

News June 10, 2024

తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

image

కరీంనగర్ MPగా రెండవసారి గెలిచిన బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బండి.. 2019లో KNR పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, ఏడాదిలోపే రాష్ట్ర BJP అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై.. 2024లో అదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సాధించారు.

News June 10, 2024

ఇండియా -పాక్ మ్యాచ్.. హాజరైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

image

అమెరికాలో జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వీక్షిస్తున్నారు. అమెరికా పర్యటనలో అనిరుధ్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మ్యాచ్ వీక్షించడానికి వెళ్లారు.

News June 10, 2024

యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్ వెంకట్రావ్

image

సోమవారం నుంచి సూర్యాపేట జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసన మండలి ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘం కోడ్ ముగిసిందని జిల్లాతో పాటు అన్ని మండలాల్లో తహశీల్దార్ల కార్యాలయాల్లో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా చేపట్టాలని సూచించారు.

News June 10, 2024

ఐఈడీ మందు పాతరలు నిర్వీర్యం

image

వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 4 ఐఈడీ మందు పాతరలను బీడీ బృందాలు గుర్తించినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశామన్నారు. మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చి, అమాయకుల ప్రాణాలను తీస్తున్నారన్నారు. వీటిలో ఇప్పటికే 3 పేలిపోగా .. ఒక మందు పాతరను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.

News June 10, 2024

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,82,459 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,26,500, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.1,04,100, అన్నదానం రూ.51,859 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News June 10, 2024

వాజేడు: అధిక లోడుతో వెళ్తున్న 5 లారీలు సీస్

image

వాజేడు మండలం జగన్నాధపురం వద్ద అతివేగంగా వస్తున్న 5 ఓవర్ లోడ్ ఇసుక లారీలను గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ డిడి కంటే 5 టన్నుల ఇసుక అదనంగా తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మండలంలోని అయ్యవారిపేటకు చెందిన 2, రాంపూర్‌కు చెందిన 3 లారీలుగా వాటిని గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి, వాజేడు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

News June 10, 2024

KMR: శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో కళ్యాణ మహోత్సవం

image

కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్‌లోని శ్రీ కల్కి భగవాన్ శ్రీ భగవతి పద్మావతి దేవి కళ్యాణ మహోత్సవానికి ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. గుడిలకు సంబంధించిన ఏ సమస్య ఉన్న నా దగ్గర దాకా తీసుకురావాలని, ఆలయాలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.

News June 10, 2024

ADB: JEE అడ్వాన్స్ ఫలితాల్లో మెరిసిన ‘ సిరి ‘

image

JEE అడ్వాన్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్‌కు చెందిన నర్ర నవీన్ యాదవ్-
రమాదేవి దంపతుల కూతురు నర్ర సిరి జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 2236 ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల కుటుంబీకులు, బంధువులు విద్యార్థినిని అభినందించారు.

News June 10, 2024

రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఆచారి..?

image

కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. ఆయన గత 40 ఏళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సైతం పని చేసినట్లు అనుచరులు అంటున్నారు. పార్టీని నమ్ముకున్న ఆచారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు.

News June 10, 2024

మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో మెదక్ ఎంపీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడవ సారి ప్రమాణ స్వీకారోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో జరిగిన ప్రధాని మోదీ, మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గొడెం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.